Weight Loss: గుడ్డు, చికెన్.. బరువు తగ్గడానికి ఈ రెండింటిలో ఏది మంచిది ?
ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ అధిక బరువు సమస్య అన్నది ప్రధాన
- By Nakshatra Published Date - 07:30 AM, Wed - 30 November 22
ప్రస్తుత కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ అధిక బరువు సమస్య అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే అధిక బరువును తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల చిట్కాలను ప్రయత్నిస్తున్నప్పటికీ కొందరిలో మార్పు కనిపించకపోయేసరికి నిరాశ వ్యక్తం చేస్తూ ఉంటారు. అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు బరువు తగ్గాలి అనుకుంటే రాత్రి సమయంలో తేలికపాటి భోజనం చేయాలి. ఉదయం రాత్రి పూట తేలిక ఆహారాలు తీసుకోవడం వల్ల బరువు తొందరగా తగ్గుతారు. అదేవిధంగా రాత్రి సమయంలో కొంచెం ముందుగా తినడం వల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. అదేవిధంగా సమయంలో తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల కేలరీలు చాలా తక్కువ మొత్తంలో శరీరానికి అందుతాయి.
రాత్రిపూట మీరు పడుకునే రెండు గంటల ముందు భోజనం చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అయితే బరువు తగ్గాలి అనుకున్నవారు చికెన్, గుడ్డు తింటే ఈ రెండింటిలో ఏవి తొందరగా బరువు తగ్గేలా చేస్తాయి అన్న విషయానికి వస్తే.. గుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల కేలరీలు శరీరానికి అందుతాయి అన్న విషయం తెలిసిందే. కాబట్టి వైద్యులు కూడా ప్రతిరోజు ఒక కోడిగుడ్డును తీసుకోమని చెబుతూ ఉంటారు. కోడి గుడ్డులో కార్బోహైడ్రేట్లు, నియాసిన్, సెలీనియం, ఫాస్పరస్, విటమిన్ బి6, విటమిన్ బి 12, రిబోఫ్లేవిన్ ఇలా ఎన్నో రకాల పోషకాలు శరీరానికి అందుతాయి. అయితే చాలామంది గుడ్డు, చికెన్ ను బరువు తగ్గడానికి తింటూ ఉంటారు. గుడ్డు లేదా చికెన్ లో ఎక్కువ మొత్తంలో పోషకాలు లభిస్తాయి. జీర్ణక్రియ మీ శరీరం ప్రాసెస్ చేసే విధానాన్ని బట్టి గుడ్డు లేదా చికెన్ తినవచ్చు.
అయితే చాలామంది గుడ్డు తినడం వల్ల విపరీతంగా బరువు పెరతారని గుడ్డు తినడానికి ఇష్టపడరు. కానీ గుడ్లు తక్కువ కార్బోహైడ్రేట్స్ తక్కువ క్యాలరీలు, తక్కువ ప్రోటీన్లు కలిగిన ఒక అద్భుతమైన ఆహారంగా చెప్పవచ్చు. కానీ గ్యాస్ట్రోసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి ఉన్నవారు గుడ్డును తీసుకుంటే నిద్రకు భంగం కలుగుతుంది. కాబట్టి గుడ్డు తినడం వల్ల అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చు. చికెన్ ను ప్రతి రోజు తినడం వల్ల అధిక బరువు సమస్య మరింత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Tags
Related News
Jaggery Side Effects : ఈ ఆరోగ్య సమస్యతో బాధపడేవారు బెల్లం తినకూడదు
బెల్లంలో పోషకాలు అధికంగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.