Health Tips: ఈ ఎండిన పండును నెయ్యిలో వేయించి తింటే చాలు.. సమస్యలన్నీ పరార్!
నెయ్యి వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, నెయ్యిని తరచుగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చనీ చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:32 PM, Wed - 25 December 24

నెయ్యి వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నెయ్యిని అనేక రకాల వంటలు తయారీలో స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఆహార పదార్థాలకు రుచిని పెంచడంతోపాటు ఎన్నో ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. నెయ్యిలో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ,డి, ఇ,కె, ఒమేగా 3, ఒమేగా6 వంటి ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, లినోలిక్, బ్యుటిరిక్ యాసిడ్స్ వంటి పోషకాలు ఉన్నాయి. అలాంటి నెయ్యిలో డ్రై ఫ్రూట్ అయిన ఎండు ద్రాక్షను వేయించి తింటే బోలెడు లాభాలు కలుగుతాయట.
ఎండు ద్రాక్ష తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుందనీ చెబుతున్నారు. కాగా కిస్‌మిస్ లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గతుంది. దీనిని రోజూ తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. కాలేయ పనితీరు కూడా మెరగవుతుంది. రోజూ ఎండు ద్రాక్ష తినడం వల్ల దంత సమస్యలు తగ్గుతాయి. వీటిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎముకల ఆరోగ్యానికి ఎండు ద్రాక్ష చాలా మంచిది. అలసట, నీరసంతో బాధపడేవారికి తక్షణ శక్తిని ఇస్తుంది ఎండు ద్రాక్ష. మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడేవారు వీటిని తినడం వల్ల మేలు జరుగుతుంది.
అదే ఎండుద్రాక్షను నెయ్యిలో వేయించి తింటే శరీరానికి రెట్టింపు ప్రయోజనాలు అందుతాయనీ చెబుతున్నారు. కాగా ఎండుద్రాక్ష తినడం వల్ల శారీరక బలహీనత తొలగిపోతుందట. రక్తహీనత లేదా బలహీనతతో బాధపడుతున్న వారికి ఎండు ద్రాక్ష బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఎండుద్రాక్షలో వివిధ సూక్ష్మపోషకాలు, ఐరన్, విటమిన్లు, ఇతర పోషకాలు మెండుగా ఉన్నాయి. అదే నెయ్యిలో వేయించి తినడం వల్ల రెండింటి ప్రయోజనాలు చేకూరతాయి. వేయించిన కిస్‌మిస్ తినడం వల్ల శరీరానికి పోషకాహారం లభిస్తుంది. ఇది శారీరక అలసటను తగ్గిస్తుంది, బలహీనతను తొలగిస్తుంది. అంతేకాకుండా బాడీ పెయిన్స్ నుంచి ఉపశమనం లభిస్తుందట.