Health : వర్షకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తినండి..!!
గతకొన్నాళ్లుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్ లో ఫ్లూ, జ్వరం, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ఎక్కువగా ప్రభలే అవకాశం ఉంటుంది.
- By hashtagu Published Date - 08:52 PM, Sun - 9 October 22
గతకొన్నాళ్లుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ సీజన్ లో ఫ్లూ, జ్వరం, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులు ఎక్కువగా ప్రభలే అవకాశం ఉంటుంది. గుండె, షుగర్ పేషంట్లు కూడా ఈ సమయంలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఈ సమయంలో రోగులు తమ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకునేందుకు ఏం తినాలో…ఏం తినకూడదో తెలుసుకుందాం.
డ్రైఫ్రూట్స్:
వీటిని వర్షకాలంలో తినడం ఉత్తమం. కేవలం రుచి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. రోగనిరోధశక్తిని పెంచడంలో సహాయపడతాయి. అదనంగా వాటిలో ఉంటే ఉండే ప్రొటిన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. యాంటీఆక్సిడెంట్స్ గుణాలు పుష్కలంగా ఉండే డ్రై ఫ్రూట్స్ మధుమేహం, క్యాన్సర్, గుండెజబ్బులు వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాంటి పరిస్థితిలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల వర్షాకాలంలో వ్యాధులు రాకుండా ఉండటమే కాదు..ఇతర రోజుల్లో కూడా అవి ఉపయోగపడతాయి.
హెర్బల్ టీ:
చల్లని వాతావరణంలో వేడి వేడి టీ తాగుతే ఈ మజానే వేరుంటుంది. సాధారణ టీకి బదులుగా వర్షాకాలంలో హెర్బల్ టీ తీసుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వర్షాకాలంలో బ్యాక్టిరియా వల్ల అనేక రకాల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. మరోవైపు హెర్బల్ టీలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. హెర్బల్ టీలో ఉండే ఈ ప్రభావం బ్యాక్టీరియా దాని వల్ల కలిగే ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. గ్రీన్ టీలో ఉండే యాంటీ వైరల్ లక్షణాలు వైరల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి.
వేడి నీరు:
వేడి నీటిని తాగడం ద్వారా అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. అయితే వర్షాకాలంలో వేడి నీటిని తీసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. వాస్తవానికి, వర్షాకాలంలో ముక్కు దిబ్బడ, ముక్కు కారడం సాధారణం. నాసికా రద్దీ సమస్యను పరిష్కరించడంలో వేడి నీళ్లు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.
మొలకలు :
మొలకలు లేదా మొలకెత్తిన ధాన్యాలను ఆరోగ్యకరమైన ఆహారం అంటారు. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, విటమిన్లు వంటి అనేక రకాలపోషకాలు లభిస్తాయి. మెరుగైన రోగనిరోధక వ్యవస్థ, రక్తం, ఎముకల ఆరోగ్యాన్ని నిర్వహించడానికి మొలకలు సహాయపడతాయి. ఇవి క్యాన్సర్, గుండె సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఇవే కాకుండా మొలకలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది.
తాజా కూరగాయలు :
వర్షాకాలంలో వంటలలో తాజా కూరగాయలను కూడా ఉపయోగిస్తారు. క్యాల్షియం, ఎనర్జీ, మెగ్నీషియం, ఐరన్, కెరోటినాయిడ్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి అనేక రకాల పోషకాలు కూరగాయలలో పుష్కలంగా ఉన్నాయి. కూరగాయలలో లభించే ఈ పోషకాలు వ్యాధులను దూరం చేయడంలో మాత్రమే కాకుండా, శరీరానికి బలాన్ని అందించడంతో పాటు పోషకాహార లోపం సమస్యను దూరం చేస్తాయి. తాజా కూరగాయలలో బ్రోకలీని ఉపయోగించడం ప్రయోజనకరంగా ఉంటుంది. బ్రోకలీ క్యాన్సర్, గుండె జబ్బులు, అధిక రక్తపోటును నివారించడంలో కూడా సహాయపడుతుంది. అయితే ముందుగా కూరగాయలను బాగా కడిగి ఆ తర్వాతే వండాలని గుర్తుంచుకోండి.
ఏవి తినకూడదు?
వర్షాకాలంలో మర్చిపోయి కూడా వీటిని తినకండి. పచ్చని ఆకు కూరలు, కుళ్ళిన కూరగాయలు-పండ్లు, ఆల్కహాల్, అధిక కెఫిన్ కలిగిన ఆహారాలు, ఐస్ క్రీం, నూనెలు మసాలాలు వంటి జోలికి వెళ్లకండి.
Tags
Related News
Cough Tips : ఎక్కువ సేపు దగ్గు వస్తే జాగ్రత్త.. కోరింత దగ్గు కావచ్చు..!
మార్చి-ఏప్రిల్ నెలల్లో వాతావరణంలో మార్పులతో జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులను ప్రజలు ఎదుర్కోవాల్సి వస్తోంది.