Health Tips: భోజనం తర్వాత బెల్లం ముక్క తింటే ఏం జరుగుతుందో తెలుసా?
మామూలుగా ఇంట్లోనే పెద్దలు భోజనం చేసిన తర్వాత స్వీట్ తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. కానీ చాలా ఉంది ఈ విషయాన్ని కొట్టి పాడేస్తూ ఉంటారు. అయితే స్వీట్ తినమని చెప్పారు కదా అని మార్కెట్లో దొరికే పంచదారతో తయారుచేసిన
- By Anshu Published Date - 11:23 AM, Tue - 16 July 24

మామూలుగా ఇంట్లోనే పెద్దలు భోజనం చేసిన తర్వాత స్వీట్ తింటే మంచిది అని చెబుతూ ఉంటారు. కానీ చాలా ఉంది ఈ విషయాన్ని కొట్టి పాడేస్తూ ఉంటారు. అయితే స్వీట్ తినమని చెప్పారు కదా అని మార్కెట్లో దొరికే పంచదారతో తయారుచేసిన స్వీట్లు కాకుండా మన ఇంట్లో వంట గదిలో ఉండే బెల్లం ని తినడం మంచిది అంటున్నారు వైద్యులు. ఒకప్పుడు ఈ విషయాన్ని అందరూ బాగా పాటించేవారు. భోజనం చేయగానే కొంచెం బెల్లం ముక్కను నోట్లో వేసుకునేవారు. కానీ రాను రాను ఈ సాంప్రదాయాన్ని అందరూ మర్చిపోయారు. కానీ ఈ జనరేషన్ వారికి తెలియని విషయం ఏమిటంటే భోజనం చేసిన తర్వాత బెల్లం నోట్లో వేసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయట.
మరి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బెల్లం మన శరీరానికి అవరసరమైన ఐరన్ అందిస్తుంది. అంతేకాదు బెల్లం తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందట. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎంజైమ్స్ యాక్టివేట్ అవుతాయని చెబుతున్నారు. భోజనం చేసిన వెంటనే చిన్న బెల్లం ముక్క తినడం వల్ల తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణమౌతుందట. బ్లోటింగ్, అరుగుదల సమస్యలు ఏవైనా ఉంటే సులభంగా తగ్గుతాయట. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మన శరీరంలో ఆక్సిడేటివ్ ఒత్తిడి, లేదంటే ఏదైనా గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడటంలో సహాయం చేస్తాయట. అలాగే బెల్లం తినడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుందట. అంతేకాకుండా శరీరంలో క్యాలరీలు సులభంగా బర్న్ చేయడంలో సహాయపడతాయని చెబుతున్నారు. మన బరువు ఆరోగ్యకరంగా ఉండేలా, అధిక బరువు పెరగకుండా ఆపేయడంలో సహాయపడుతుందట.
అధిక బరువు సమస్యతో బాధపడేవారికి ఇది చాలా మెరుగ్గా ఉపయోగపడుతుందని చెబుతున్నారు వైద్యులు. కాగా బెల్లం మనకు సహజంగా డీ టాక్సిఫయ్యర్ గా సహాయపడుతుందట. కాబట్టి భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం వల్ల బాడీని డీటాక్సిఫై చేస్తుందట. అంతేకాకుండా లివర్ ని శుభ్రంగా ఉంచడంలో మెరుగ్గా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా అనీమియా, రక్త హీనతతో బాధపడుతున్న వారు భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం మంచిది. హిమోగ్లోబిన్ లెవల్స్ పెంచడంలో సహాయపడుతుందట. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు కచ్చితంగా ఈ బెల్లం ముక్క తినాల్సిందే అంటున్నారు వైద్యులు.
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది.