Bad Breath: ఒకే ఒక్క నిమిషంలో నోటి దుర్వాసనను తరిమికొట్టే చిట్కా.. అదేంటంటే?
మామూలుగా మనం నోటిని ఎంత బాగా శుభ్రం చేసుకున్నా కూడా నోటి నుంచి దుర్వాసన వస్తూనే ఉంటుంది. దాంతో నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ
- By Anshu Published Date - 09:00 PM, Fri - 12 January 24

మామూలుగా మనం నోటిని ఎంత బాగా శుభ్రం చేసుకున్నా కూడా నోటి నుంచి దుర్వాసన వస్తూనే ఉంటుంది. దాంతో నలుగురిలోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే బయటకు వెళ్ళినప్పుడు ఎదుటి వ్యక్తితో మాట్లాడినప్పుడు ఈ నోటి దుర్వాసన చాలా ఇబ్బందికరంగా మనకే అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఈ నోటి దుర్వాసన పోగొట్టుకోవడం కోసం చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే అది కేవలం కొంతసేపు మాత్రమే నోరు వాసన రాకుండా ఆపగలుగుతుంది. అయినా కూడా మీ నోరు అలాగే వాసన వస్తూ ఉంటే అందుకోసం కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. మరి ఈ నోటి దుర్వాసన నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు గోరు వెచ్చటి నీటిలో అరచెంచా ఉప్పు వేసి బాగా కలిపి ఆ నీటిని తాగి పుక్కిలించినట్లయితే నోట్లో బ్యాక్టీరియా వృద్ధి చెందదు. అంతే కాకుండా నోటి దుర్వాసన తగ్గుతుంది. ఉప్పు నీటిలో నోటి దుర్వాసనను తగ్గించే ఎన్నో కారకాలు ఉంటాయి. ముఖ్యంగా బయటకి వెళ్లాలి అనుకున్నప్పుడు ఇలా చేస్తే నోరు రీఫ్రెష్ అవుతుంది. అలాగే లవంగాలు కూడా నోటి ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. లవంగాలు నోటి దుర్వాసనను దంతక్షయం, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు రోజూ రెండు లవంగాలను నీటిలో నానబెట్టుకొని, ఉదయాన్నే నమిలి తినేసి ఆ నీటిని కూడా తాగేయాలి. ఇలా చేయడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది.
లవంగాలు, ఉప్పు మీ దగ్గర ఉన్నట్లయితే నోటి దుర్వాసన మీ నుంచి దూరంగా పారిపోతుంది. పంటి నొప్పి కారణంగా నమలడం వీలు కాకపోతే అందుకు బదులుగా పేస్టు తయారు చేసుకోవాలి. నొప్పి ఉన్న పంటికి నేరుగా అప్లై చేయవచ్చు. మీకు నోటి దుర్వాసన నిలకడగా ఉండే వరకు కొన్ని లవంగాలను చూర్ణం చేస కొద్దిగా ఉప్పు వేయాలి. ప్రభావిత ప్రాంతంలో కాసేపుడ పేస్ట్ ఉంచండిఅంతే కాదండోయ్ నొప్పిని కల్గించే బ్యాక్టీరియా ప్రభావాన్ని వెల్లుల్లి తగ్గిస్తుంది. నోటి దుర్వాసన సమస్యను తగ్గించడంలో బాగా సాయపడతాయి. చిగురు నొప్పిగా ఉన్న లేదంటే ఏవైనా సమస్యలు ఉన్న, కురుపులు అయినప్పుడు కూడా ఉప్పుతో పళ్లను తోమడం వల్ల తగ్గుతాయి. లవంగ నూనను దంతాలకు ఉపయోగించడం వల్ల పంటి నొప్పి తగ్గుతుంది.