Drumsticks Health Benefits: మునక్కాయ తినడం వల్ల అన్ని రకాల అద్భుత ప్రయోజనాలా?
- By Anshu Published Date - 10:30 PM, Thu - 20 July 23

మునక్కాయ, మునగ ఆకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ మునక్కాయను ఉపయోగించి ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటారు. మునక్కాయలతో ఎటువంటి కూర చేసినా కూడా చాలామంది లొట్టలు వేసుకొని మరి తినేస్తూ ఉంటారు. మునక్కాయను తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మునక్కాయను తీసుకోవడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మునక్కాయలో విటమిన్ ఏ, బి1, బి2, బి3, బి5, బి6, బి9, సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీనిలో డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. మునక్కాయలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. మునక్కాయ మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మునక్కాయ లో కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా ఉంచుతాయి. చిన్నారులలో ఎముకల అభివృద్ధికి తోడ్పడతాయి. వృద్ధులు వారి డైట్‌లో మునక్కాయ చేర్చుకుంటే ఎముకల సాంద్రత పునరుద్ధరిస్తుంది, ఆస్టియోపోరోసిస్ లక్షణాలను తగ్గిస్తుంది.
మునగలోని శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్‌కు చికిత్స చేస్తాయి, ఎముక పగుళ్లు చిన్నగా ఉంటే వాటిని నయం చేస్తాయి. మునక్కాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్లూ, అనేక ఇన్ఫెక్షన్‌ల నుంచి రక్షణ కల్పిస్తాయి. మునక్కాయలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఆస్తమా, దగ్గు, గురక ఇతర శ్వాసకోశ సమస్యల లక్షణాలను తగ్గిస్తాయి. దగ్గు నుంచి త్వరితగతిన ఉపశమనం ఇస్తుంది. మునక్కాయ మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి, వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది.
మునక్కాయలోని థయామిన్, రిబోఫ్లావిన్, నియాసిన్, విటమిన్ బి12, బి వంటి పోషకాలు జీర్ణవ్యవస్థ సజావుగా పనిచేయాడనికి సహాయపడతాయి. ఇది కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులను సరళమైన రూపాల్లోకి విచ్ఛిన్నం చేయడానికి తోడ్పడుతుంది. మునక్కాయలోని డైటరీ ఫైబర్ పేగు కదలికలను సులభం చేసి గట్ హెల్త్‌కు మేలు చేస్తుంది. అలాగే మీ డైట్‌లో మునక్కాయ తరచుగా చేర్చుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు వచ్చే ముప్పు తగ్గుతుంది. దీనిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీల నుంచి టాక్సిన్స్‌ను క్లియర్ చేస్తాయి. కిడ్నీలపై ఒత్తిడి తగ్గించి, వాటి పనితీరు మెరుగుపరుస్తాయి.