Health Tips: చేపలు తిన్న తర్వాత పాల పదార్థాలు తినకూడదా..?
చేపలు తిన్న తర్వాత పాల పదార్థాలను అస్సలు తినకూడదని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:30 AM, Tue - 15 October 24

మాములుగా మనం కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్న తర్వాత కొన్నింటిని తినకూడదని చెబుతూ ఉంటారు. అటువంటి వాటిలో చేపలు, అలాగే మాంసం తిన్న తర్వాత పాలు లేదా పాల పదార్థాలు తినడం అన్నది కూడా ఒక్కటి. పాలు తాగిన వెంటనే చేపలు తినటం వలన ప్రయోజనం ఇవ్వటానికి బదులుగా ఒక పాయిజన్ లాగా పని చేస్తుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు చేపలు అసిడిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. పాలు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రమంలో రెండింటినీ కలిపి తీసుకుంటే గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ రెండిటిని కలిపి తీసుకోకపోవటమే మంచిదని చెబుతున్నారు.
చర్మపు మచ్చలకు పాలు లేదా చేపలతో సంబంధం లేదట. ఇది ఆటో యూనియన్ వ్యాధి అంటే రోగనిరోధక వ్యవస్థ మెలీనియంతో పోరాడే ప్రతి రోధకాలను ఉత్పత్తి చేస్తుందట. యాంటీబాడీలు దాడి చేసిన చోటల్లా చర్మంపై మచ్చలు కనిపిస్తాయట. అంతేకానీ చేపలను పాలతో కలిపి తీసుకుంటే చర్మంపై మచ్చలు రావని వైద్యులు చెబుతున్నారు. చేపలు, పాల ఉత్పత్తులలో అధిక ప్రోటీన్లు ఉంటాయట. రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చట. దీనివల్ల గ్యాస్, డయేరియా తదితరులు సమస్యలు వస్తాయేమో కానీ చర్మానికి సంబంధించిన మచ్చలు లాంటివి రావని చెబుతున్నారు.
కొన్ని కొన్ని ఆహార పదార్థాల మిశ్రమం కొందరి శరీరానికి పడదు ఎలర్జీలకి దారితీస్తుంది. అది ఆయా శరీరతత్వాల మీద ఆధారపడి ఉంటుందని, అంతే తప్పితే ఈ కాంబినేషన్లో తింటే చర్మ సమస్యలు వస్తాయని, చనిపోతాము అనేది మాత్రం పెద్ద అపోహ మాత్రమే అని వైద్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి చేపలు తిన్న తర్వాత పాలు తాగడం లేదంటే పాల పదార్థాలు తిన్న తర్వాత చేపలు తినడం లాంటివి చేయకూడదని చెబుతున్నారు. ఈ రెండు కాంబినేషన్ ఒకేసారి తింటే జీర్ణ సమస్యలు తలెత్తుతాయుట.