HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Drinking Beetroot Juice To Control High Blood Pressure

High Blood Pressure: హైబీపీ తగ్గాలి అంటే ప్రతిరోజు ఉదయం జ్యూస్ తాగాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో రకమైన

  • Author : Anshu Date : 13-01-2023 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
High Blood Pressure
High Blood Pressure

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో రకమైన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మరి ముఖ్యంగా చిన్న వయసు నుండే షుగర్, బీపీలాంటి సమస్యలను ఎదుర్కుంటున్నారు. ఈరోజుల్లో అందరినీ ఎక్కువగా చుట్టుముడుతున్న సమస్య హైబీపీ. దీనినే అధిక రక్తపోటు అని కూడా అంటారు. కానీ హై బీపీ ఉన్నవారికి బ్లడ్ ఫ్లోటింగ్ తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంటుంది. అంతేకాకుండా ఎక్కువ శాతం మంది హైబీపీ కారణంగానే మరణిస్తున్నారు. బిజీబిజీ లైఫ్‌స్టైల్‌, ఒత్తిడి, చెడు ఆహార అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాల వల్ల హైపర్‌టెన్షన్‌‌ సమస్య ఈ రోజుల్లో ఎక్కువ అయ్యింది.

చాలా సందర్భాలలో, హైపర్‌ టెన్షన్‌ పేషెంట్స్‌ ఈ సమస్యను లైట్‌గా తీసుకోవడంతో ఆందుకు సంబందించి సరైన చికిత్స కూడా తీసుకోరు. అయితే హైబీపీని నియంత్రణలో ఉంచుకోకపోతే హార్ట్‌ ఎటాక్‌, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్, కిడ్నీ వ్యాధి, గర్భధారణ సమయంలో సమస్యలు, కంటి చూపు కోల్పోవడం, స్ట్రోక్‌, వాస్కులర్ డిమెన్షియా వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే హై బీపీని కంట్రోల్ లో ఉంచుకోవాలి అంటే ప్రతిరోజు ఉదయం పూట ఈ జ్యూస్ తాగితే హైబీపీ నియంత్రణలో ఉంచుకోవడంతో పాటు ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. మరి హైబీపీని నియంత్రణలో ఉంచుకోవడం కోసం ఎటువంటి జ్యూస్ తాగాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో బీట్‌రూట్‌ రసం తాగితే హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

ప్రతిరోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగితే సిస్టోలిక్ బ్లడ్‌ ప్రెజర్‌ 4 నుంచి 5 పాయింట్లు తగ్గుతుంది. కాగా బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్స్‌ శరీరంలోకి వెళ్లి నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుతాయి. నైట్రిక్ ఆక్సైడ్‌ సహాయంతో రక్తాన్ని మోసే సిరలు రిలాక్స్‌ అవుతాయి. దీంతో హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది. అయితే బీట్‌ రూట్‌ జ్యూస్‌ను ఎప్పుడైనా తాగొచ్చు. కానీ, ఉదయం ఖాళీ కడుపుతో, బ్రేక్‌ఫాస్ట్‌కు ఒక గంట ముందు బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగితే మంచి కనిపిస్తాయి. బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగితే హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌ అవడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీట్‌ రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల స్టామినా కూడా పెరుగుతుంది. డిమెన్షియా, అధిక బరువు, కొలెస్ట్రాల్‌, లివర్‌ సమస్యలు దూరం అవుతాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • beetroot juice
  • drink beetroot juice
  • health benefits
  • high blood pressure

Related News

Heart Attack Anger

కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

Heart Attack  ఆవేశం అనర్థదాయకమని పెద్దలు చెప్పే మాట అక్షరాలా నిజమని తాజా అధ్యయనం మరోసారి నిరూపించింది. కేవలం కొద్దిసేపు వచ్చే కోపం కూడా రక్తనాళాలపై పెను ప్రభావం చూపుతుందని, గుండెపోటు లేదా పక్షవాతం బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని తేల్చింది. అమెరికాలోని వివిధ సంస్థలకు చెందిన నిపుణులు సుమారు 300 మంది ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన చేశారు. వారికి గతంలో జరిగిన ఒక కోపంతో కూడిన సంఘటనను 8

  • Garlic

    వెల్లుల్లి.. మీ వంటగదిలోనే అద్భుత ఔషధం!

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd