Alcohol: మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఇవి పాటించడం తప్పనిసరి?
సాధారణంగా మద్యం సేవించరాదు అని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. మద్యం సేవించడం వల్ల అనేక రకాల సమస్యలు
- By Nakshatra Published Date - 04:16 PM, Sun - 16 April 23
సాధారణంగా మద్యం సేవించరాదు అని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. మద్యం సేవించడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని చెబుతూ ఉంటారు. అంతేకాకుండా మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అన్న కొటేషన్ నిత్యం మనం ఎన్నో ప్రదేశాలలో చూస్తూ చదువుతూ ఉంటాం. టీవీలలో వార్తల్లో ప్రకటనల్లో ప్రతి ఒక్క చోట మనం మద్యం సేవించరాదు అనే వాటిని చూస్తూ ఉంటాం వింటూ ఉంటాం. అయినప్పటికీ మద్యం సేవించడం మాత్రం ఆపరు. కానీ మద్యం తాగడం అన్నిసార్లు అనారోగ్యానికి హానికరం కాదని కొన్ని కొన్ని సార్లు మంచిదే అంటున్నారు నిపుణులు. అదేంటి అనుకుంటున్నారా.. మద్యం తాగడం మంచిదే కానీ మీకు కొన్ని రకాల విషయాలు పాటించడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు.
మరి ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా అతిగా మద్యం సేవించడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా పెరిగి ఒబిసిటీ వస్తుంది. అలాగే లివర్ కూడా దెబ్బతింటుంది. మద్యం సేవించడం వల్ల కొన్ని కొన్ని సార్లు ప్రమాదమైన మరి కొన్నిసార్లు మంచిది అంటున్నారు నిపుణులు. మద్యం మితిమీరి కాకుండా తక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. తక్కువ మోతాదులో సరైన స్టఫ్ తో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ఆరోగ్యకరమైన స్నాక్స్ ను తక్కువ మోతాదు ఆల్కహాల్ తో తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు. ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకోకూడదని, కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉండే ఆహారాలను మద్యం సేవించేటప్పుడు తీసుకోకూడదని చెబుతున్నారు. తక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇలా తక్కువ మోతాదులో మద్యం సేవించడం వల్ల ఒబిజిటి దరిచేరదు అని అంటున్నారు. అలా అని శృతి మించి మితిమీరి తాగడం వల్ల ప్రమాదాలు తలెత్తుతాయి.
Related News
Ayushman Bharat Card: మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉందా..? లేకుంటే దరఖాస్తు చేసుకోండిలా..!
ఈ పథకం కింద ప్రజలు క్యాన్సర్, కిడ్నీ, గుండె, డెంగ్యూ, మలేరియా డయాలసిస్, మోకాలు, తుంటి మార్పిడి వంటి అనేక వ్యాధులకు ప్రభుత్వ, ప్రభుత్వేతర ఆసుపత్రులలో ఉచితంగా చికిత్స పొందవచ్చు.