Google Doctor: గూగుల్ డాక్టర్ ను నమ్ముకుంటున్నారా ? తీవ్ర పర్యవసానాలు ఉంటాయ్.. తస్మాత్ జాగ్రత్త!
డిజిటల్ విప్లవం మనుషుల జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చింది. ముఖ్యంగా 3జీ, 4జీ ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఫోన్లలో ఇంటర్నెట్ వాడటం మొదలు పెట్టారు.
- By Hashtag U Published Date - 06:45 AM, Thu - 25 August 22
డిజిటల్ విప్లవం మనుషుల జీవితాల్లో ఎంతో మార్పు తెచ్చింది. ముఖ్యంగా 3జీ, 4జీ ఇంటర్నెట్ వచ్చినప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూడా ఫోన్లలో ఇంటర్నెట్ వాడటం మొదలు పెట్టారు. ఆన్ లైన్లో వివిధ బిల్లుల పేమెంట్స్ చేయడం దగ్గరి నుంచి ఇంటి దగ్గరే కూర్చొని వర్చువల్ హెల్త్ చెకప్ చేయించుకునే దాకా ఎన్నో విషయాల్ని జనం నేర్చుకున్నారు. డిజిటల్ విప్లవం.. ఇంటర్నెట్ విప్లవం వల్లే ఇది సాధ్యమైంది. అయితే కొంతమంది మరో అడుగు ముందుకు వేసి ఆరోగ్య సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి తెలుసుకునేందుకు “గూగుల్ డాక్టర్” ను నమ్ముకుంటున్నారు. ఇంతకీ ఏమిటీ గూగుల్ డాక్టర్.. ఈ అలవాటు మంచికి దారి తీస్తుందా? చెడుకు దారి తీస్తుందా? ఇప్పుడు చూద్దాం.
ఉదాహరణకు ఒక వ్యక్తికి మెడ నొప్పి కలిగిందని భావించండి. అతడు గూగుల్ డాక్టర్ ని నమ్ముకున్నట్లయితే.. ముందుగా googleలోకి వెళ్లి మెడ నొప్పి గురించి సెర్చ్ చేస్తున్నాడు. మెడ నొప్పి సమస్య ఎందుకు వస్తుంది? దానికి కారణాలు ఏమిటి ? మెడ నొప్పి ఎందుకు తీవ్రం అవుతుంది? నొప్పి తీవ్రమైతే వచ్చే ఆరోగ్య రుగ్మతలు ఏమిటి? అనే ప్రశ్నలను గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. వీటికి వచ్చే సమాధానాల ఆధారంగా కొందరు సొంత చికిత్స చేసుకుంటున్నారు. గూగుల్ చూపించే మందులను వాడుతున్నారు. అయితే ఈ మందుల వాడకం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మరిచి పోతున్నారు. ఫలితంగా ఒక ఆరోగ్య సమస్యను పరిష్కరించు కోబోయి.. మరో కొత్త ఆరోగ్య సమస్యను కొని తెచ్చుకుంటున్నారు. అందుకే గూగుల్ నమ్ముకొని వైద్యం చేసుకోవడం మంచిది కాదని వైద్యులు సూచిస్తున్నారు. శరీర తత్వం, అప్పటికే ఉన్న దీర్ఘకాలిక వ్యాధుల ఆధారంగా డాక్టర్లు సరైన మందులను రాస్తారు. వాటిని వాడటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే గూగుల్ ద్వారా ట్రీట్మెంట్ పొందేవాళ్ళు బీ కేర్ ఫుల్. కేవలం డాక్టర్ ద్వారానే చికిత్స పొందండి.
Related News
Heart Attack: ఈ చిన్న తప్పులే మగవారిలో గుండెపోటుకు కారణమని తెలుసా..?
గత కొన్నేళ్లుగా ప్రపంచంలో చాలా మంది చిన్న వయస్సులోనే గుండె సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారు. అందులోనూ పురుషులే అత్యధిక సంఖ్యలో ఉంటున్నారు. మగవారికి గుండె సంబంధిత వ్యాధులు ఎందుకు వస్తున్నాయి.