Paneer : వామ్మో కేజీ ఫన్నీరు రూ. లక్ష..అంత ప్రత్యేకత ఏంటో..?
Paneer : తాజాగా మార్కెట్లో కనిపిస్తున్న ఈ ప్రత్యేకమైన పనీర్ ధర వింటే ఎవ్వరైనా షాక్ అవుతారు. ఎందుకంటే ఇది గాడిద పాలతో తయారవుతుంది
- By Sudheer Published Date - 07:41 PM, Sat - 12 April 25

పనీర్ (Paneer ) అంటేనే ప్రతి ఇంట్లో వంటల్లో ప్రత్యేకంగా ఉపయోగించే పదార్థం. సాధారణంగా ఇది ఆవు లేదా గేదె పాలతో తయారు చేస్తారు. కానీ తాజాగా మార్కెట్లో కనిపిస్తున్న ఈ ప్రత్యేకమైన పనీర్ ధర వింటే ఎవ్వరైనా షాక్ అవుతారు. ఎందుకంటే ఇది గాడిద పాలతో తయారవుతుంది. దీని ధర కిలోకు రూ. లక్ష వరకు ఉంటుంది. ఇది సాంప్రదాయ పనీర్ కంటే వందల రెట్లు ఎక్కువ. అయితే ఇందులో అంత ఖరీదు ఎందుకు, దాని వెనుక ఉన్న కారణాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
TGPSC : బీఆర్‌ఎస్ నేతకు టీజీపీఎస్సీ నోటీసులు
గాడిద పాలు (Donkey Milk-) అంటేనే ప్రపంచవ్యాప్తంగా “ద్రవ బంగారం”గా పిలుస్తుంటారు. ఈ పాలలో విటమిన్లు, మినరల్స్, ప్రోటీన్లు, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచే లైసోజైమ్ అనే సహజ ఎంజైమ్ ఇందులో ఉంటుంది. యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉండటంతో, ఇది ఆరోగ్య పరంగా చాలా ఉపయోగకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చర్మానికి మెరుపు, మృదుత్వం ఇచ్చే గుణాల వల్ల రోమన్ రాణి క్లియోపాత్రా ఈ పాలతో స్నానం చేసేదట.
ఒక గాడిద రోజుకు కేవలం 200-300 మిల్లీ లీటర్ల మాత్రమే పాలు ఇస్తుంది. లీటర్ పాల (Milk) కోసం చాలామంది గాడిదలు అవసరం అవుతాయి. పైగా ఆ పాలను జున్నుగా మార్చడం చాలా కష్టమైన ప్రక్రియ. అందుకే ఈ పనీర్ తయారీ ఖర్చుతో పాటు శ్రమ కూడా ఎక్కువగా ఉంటోంది. ఈ ప్రత్యేకమైన పనీర్ ఇప్పుడు గుజరాత్, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కొన్ని స్టార్టప్‌లు తయారు చేస్తున్నాయి. గాడిద పాలతో చాక్లెట్, సబ్బు తయారీ తర్వాత ఇప్పుడు పన్నీర్ కూడా అందుబాటులోకి వచ్చింది. విదేశీ మార్కెట్‌లో దీనికి మంచి డిమాండ్ ఉండటంతో, భారతీయ మార్కెట్‌లోనూ దీని ప్రాముఖ్యత పెరుగుతోంది.