Mango: వామ్మో.. షుగర్ కిడ్నీ సమస్యలు ఉన్నవారు మామిడిపండు తింటే అంత డేంజరా?
వేసవికాలంలో ఎక్కువగా లభించే మామిడి పండ్లను షుగర్ పేషెంట్లు అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నవారు తినడం అసలు మంచిది కాదని ఇది ఎన్నో రకాల సమస్యలను తెచ్చిపెడుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:00 PM, Mon - 14 April 25

పండ్లలో రారాజు అయినా మామిడి పండ్ల గురించి మనందరికీ తెలిసిందే. మామిడిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వేసవి కాలంలో లభించే మామిడి పండు కోసం ఏడాది మొత్తం ఎదురు చూసే వారు కూడా ఉన్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మామిడి పండ్లను ఇష్టపడి తింటూ ఉంటారు. ముఖ్యంగా వేసవికాలంలో జ్యూస్ లు,షర్బతులు వంటివి తయారు చేసుకుని తింటూతాగుతూ ఉంటారు. మామిడిపండ్లలో విటమిన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు అనేక వ్యాధుల నుండి కూడా రక్షిస్తాయి.కాగా మామిడి పండు ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొంతమంది కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మామిడి పండును తినకూడదట.
ఎందుకంటే మామిడి పండు వారి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు మామిడిపండు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మధుమేహం ఉన్నవారు మామిడి పండును తినకూడదట. ఎందుకంటే మామిడి పండులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. మామిడి పండు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరిగిపోతాయట. ఇది మధుమేహాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తుందని చెబుతున్నారు. ఒకవేళ తినాలి అనుకున్న వైద్యుల సలహా తప్పనిసరి అని చెబుతున్నారు. అప్పుడు కూడా తక్కువగా తినాలని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదని చెబుతున్నారు.
కాగా కొంతమందికి మామిడి పండు తింటే అలెర్జీ వస్తుంది. మామిడి పండులో ఉండే కొన్ని పదార్థాల వల్ల అలెర్జీ వస్తుంది. మామిడి పండు అలెర్జీ ఉన్నవారికి దురద, దద్దుర్లు, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయట. ఒకవేళ మీకు మామిడి పండు తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మామిడి పండు తినడం ఆపేయాలని చెబుతున్నారు.
అలాగే కిడ్నీ సమస్యలు ఉన్నవారు కూడా మామిడి పండును తినకూడదట. మామిడి పండులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. కిడ్నీలు సరిగా పనిచేయకపోతే శరీరంలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయట. ఇది గుండెకు ప్రమాదకరంగా మారుతుందని చెబుతున్నారు. కాబట్టి కిడ్నీ సమస్యలు ఉన్నవారు మామిడి పండు తినాలి అనుకుంటే తక్కువగా తినాలని చెబుతున్నారు. గుండెల్లో మంట సమస్య ఉన్నవారు మామిడి పండును తినకూడదు. మామిడి పండు పులుపు స్వభావం కలిగి ఉంటుంది. ఇది గుండెల్లో మంటను మరింత పెంచుతుంది. గుండెల్లో మంట సమస్య ఉన్నవారు మామిడి పండు తినాలని అనుకుంటే తక్కువ మొత్తంలో తినవచ్చని చెబుతున్నారు.