Patients Tongue : పేషెంట్ల నాలుకను డాక్టర్లు ఎందుకు చెక్ చేస్తారు..?
Patients Tongue : పేషెంట్ ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి డాక్టర్లు నాలుకను చెక్ చేస్తుంటారు.
- Author : Pasha
Date : 31-10-2023 - 4:35 IST
Published By : Hashtagu Telugu Desk
Patients Tongue : పేషెంట్ ఆరోగ్య స్థితిని తెలుసుకోవడానికి డాక్టర్లు నాలుకను చెక్ చేస్తుంటారు. ఈవిషయం మనందరికీ తెలుసు. ఇంతకీ నాలుకను చూసి డాక్టర్లు ఏం తెలుసుకుంటారు ? నాలుకలో ఏయే తేడాలను డాక్టర్లు గమనిస్తారు ? అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
We’re now on WhatsApp. Click to Join.
ఆరోగ్యవంతుల్లో నాలుక ఎలా ఉంటుంది ?
నాలుక రంగు అనేది మన ఆరోగ్యస్థితిని ప్రతిబింబిస్తుంది. నాలుక రంగులో వచ్చిన మార్పులను డాక్టర్లు గుర్తిస్తారు. ఆరోగ్యవంతులలో నాలుక రంగు గులాబీ రంగులో ఉంటుందని అంటారు. దానిపై తెల్లగా సన్నని పొర ఉంటుంది.ఆరోగ్యకరమైన నాలుకపై మచ్చలు ఉండవు . అది తేమగా ఉంటుంది. కొందరిలో నాలుక.. లేత గులాబీ లేదా ముదురు గులాబీ రంగులోనూ ఉంటుంది. నాలుకపై తెల్లటి మచ్చలు ఉంటే.. ఈస్ట్ ఇన్ఫెక్షన్‌కు సంకేతాలు. ల్యూకోప్లాకియా వల్ల కూడా ఈ మచ్చలు వస్తుంటాయి. అయితే ఈ మచ్చలు అపాయం కలిగించవు. కొన్నిసార్లు ఇవి క్యాన్సర్‌కు సిగ్నల్స్‌గా నిలుస్తాయి.
నలుపు, నీలం, పసుపు రంగుల్లో నాలుక ఉంటే..
గొంతులో బ్యాక్టీరియా లేదా ఫంగస్ ఉంటే.. నాలుక నల్లగా మారుతుంది. కొన్ని మందుల ప్రభావంతో షుగర్ రోగుల్లోనూ నాలుక రంగు నల్లగా మారుతుంది. నాలుక నీలం రంగులోకి మారితే గుండె వ్యాధులు ముసురుకుంటున్నాయనే డేంజరస్ సిగ్నల్‌ను ఇస్తుంది. కొన్నిసార్లు రక్తంలో ఆక్సిజన్ లేకపోవడం వల్ల కూడా నాలుక నీలం రంగులోకి ఛేంజ్ అవుతుంది. నాలుక పసుపు రంగులోకి మారితే కామెర్ల లక్షణంగా పరిగణిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే డాక్టర్‌ను (Patients Tongue) సంప్రదించాలి.
Also Read: Pandikona Dogs : పందికోన కుక్కలా మజాకా.. వాటి స్పెషాలిటీ ఇదీ
గమనిక: ఈ వార్తలోని వివరాలను ఎక్స్ పర్ట్స్ అభిప్రాయం, విశ్లేషణ, మీడియా నివేదికల ప్రకారం అందించాం. ఇది కేవలం మీ అవగాహన కోసమే. మీ నిర్ణయానికి పూర్తి బాధ్యత మీదే.