Bitter Ground: పీరియడ్స్ కి వారం రోజులు ముందు కాకరకాయ తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
మామూలుగా కాకరకాయ అంటే చాలు చాలామంది మాకొద్దు బాబోయ్ అని అంటూ ఉంటారు. కాకరకాయ చేదుగా ఉండటం వల్ల చాలామంది పదార్థాలను తినడానికి ఎంతగా
- By Anshu Published Date - 05:30 PM, Mon - 18 December 23

మామూలుగా కాకరకాయ అంటే చాలు చాలామంది మాకొద్దు బాబోయ్ అని అంటూ ఉంటారు. కాకరకాయ చేదుగా ఉండటం వల్ల చాలామంది పదార్థాలను తినడానికి ఎంతగా ఇష్టపడరు. చిన్నపిల్లల మాత్రమే కాకుండా పెద్దలు కూడా చాలామంది కాకరకాయ తినడానికి అస్సలు ఇష్టపడరు. కొందరు మాత్రం కాకరకాయ చేదుగా ఉన్న సరే ఇష్టంగా తింటూ ఉంటారు. కానీ కాకరకాయ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు ఉండలేరు. ఇది శరీరంలో పిండి పదార్థాలు అలాగే షుగర్ లెవెల్స్ తగ్గించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
అధికంగా మద్యం సేవించిన వారికి మత్తు దిగి పోవాలంటే రెండు చెంచాల కాకరకాయ జ్యూస్ ఇస్తే చాలు ఇంత ముందు తాగినా కూడా దెబ్బకు దిగిపోవాల్సిందే అలాగే పాదాలు మంటగా ఉన్నప్పుడు కాకరకాయ జ్యూస్ పట్టించడం వల్ల మంట సమస్య నుంచి బయటపడవచ్చు. కడుపులో నులిపురుగులతో ఇబ్బంది పడుతున్న పిల్లలకి అరచెంచా కాకరకాయ రసం ఒక చెంచా తేనె కలిపి రాత్రి పూట పడుకునే ముందు మూడు నాలుగు రోజులు అలా తాగిస్తే కడుపులో పురుగులు చనిపోతాయి. మొలలతో ఇబ్బంది పడేవారు నెలరోజుల పాటు రెండు మూడు చెంచాల కాకరకాయ రసం మజ్జిగలో కలిపి తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
అలాగే అల్ప రక్తస్రావం అయ్యే స్రీలు కాకరకాయ రసం, తేనెలను ఒక చెంచా చొప్పున రుతు స్రావానికి వారం రోజులు ముందు నుంచి త్రాగితే పరిస్థితి మంచిగా మెరుగుపడుతుంది. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాకరకాయ కూరను తరచుగా తీసుకుంటే దానిలోని విటమిన్ ఏ, బి, సి ఇనుము తదితరాలు కంటిచూపు మెరుగు పడుతుంది. ఒక చెంచా నిమ్మరసం ఒక చెంచా కాకరకాయ రసం 4 ,5 మిరియాలు తేనెల్లో కలిపి పరగడుపున మూడు నాలుగు తీసుకుంటే ధర్మవ్యాదులు, దురదలు, గజ్జి లాంటివి పోతాయి. మధుమేహం స్థూలకాయ సమస్యలతో ఇబ్బంది పడేవారు రోజు పరగడుపున 30 మెల్లి లీటర్ల చొప్పున కాకరకాయ రసం తీసుకుంటే చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.
కాకర రసాన్ని తీసుకోలేని వాళ్ళు కాయలని నీడలో ఎండబెట్టి గింజలతో సహా పొడి చేసి ఒక స్పూన్ పొడితో మరో స్పూన్ నేరేడు గింజల పొడి ఉసిరి పొడి నీటిలో కలిపి పరిగడుపున తాగినట్లయితే మొదట్లో ఉన్న షుగర్ వ్యాధి కంట్రోల్ లోకి వస్తుంది. అయితే ఈ కాకరకాయ రసాన్ని రోజుకి 30 మిల్లీమీటర్లు మించి తీసుకున్నట్లయితే అజీర్ణం వాంతులు లాంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ కాకరకాయ రసం తీసుకునేటప్పుడు కేవలం 30 మిల్లీలు లీటర్లు మాత్రమే తీసుకోవాలి. అలాగే ఎండాకాలంలో కాకరకాయలు కూర కొంచెం వేడి చేసి మలబద్ధకానికి దారితీస్తూ ఉంటుంది. కావున వేసవిలో కాకరకాయలు కి దూరంగా ఉండటం మంచిది.