Tea Side Effects: సాయంత్రం సమయంలో టీ తాగుతున్నారా.. ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?
దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలలో ఎక్కువ మంది ఇష్టపడే పానీయాలలో టీ, లేదా కాఫీ ఒకటి. చాలామంది ప్రతి రోజు వారి
- By Anshu Published Date - 06:30 AM, Mon - 9 January 23

దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలలో ఎక్కువ మంది ఇష్టపడే పానీయాలలో టీ, లేదా కాఫీ ఒకటి. చాలామంది ప్రతి రోజు వారి ఉదయాన్ని కప్పు టీతో ప్రారంభిస్తూ ఉంటారు. టీ లేదా కాఫీ లేకపోతే ఆ రోజంతా కూడా ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక చాలామందికి రోజుకు ఒక్కసారైనా టీ తాగకపోతే రోజు గడవదు అంటే టీ కీ ఎంతలా ఎడిక్ట్ అయిపోయారో అర్థం చేసుకోవచ్చు. మనిషి జీవితాల్లో టీ కూడా ఒక భాగంగా మారిపోయింది. కొంతమంది అయితే రోజుకు కనీసం నాలుగైదు సార్లు అయినా టీ తాగుతూ ఉంటారు. అయితే టీ, కాఫీలు ఎక్కువగా తాగడం ఆరోగ్యానికి హానికరం తెలిసినా కూడా చాలామంది వాటిని మానుకోలేరు. చాలామందికి ఉదయం టీ తాగడంతో పాటు సాయంత్రం కూడా టీ తాగడం అలవాటుగా ఉంటుంది.
కానీ సాయంత్రం సమయంలో టీ తాగడం అంతే మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఎందుకంటే టీ కాఫీలలో కెఫిన్ అనే పదార్థం ఉంటుంది. కాబట్టి నిద్రించడానికి 10 గంటల ముందు కాఫీలు టీలు తాగడం మంచిది. దీనివల్ల కాలేయం ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కార్టిసాల్ స్థాయులు తగ్గిపోతాయి. అలాగే జీర్ణప్రక్రియ కూడా మెరుగవుతుంది. అయితే సాయంత్రం సమయంలో ఎవరు టీ తాగవచ్చు అన్న విషయాన్ని వస్తే.. నైట్ షిఫ్ట్‌లలో పనిచేసే వారు సాయంత్రం టీ తాగొచ్చు. అలాగే అసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలు లేని వారు సాయంత్రం పూట టీ తాగవచ్చు. సంపూర్ణ జీర్ణశక్తి ఉన్నవారు, రోజూ సమయానికి ఆహారం తీసుకునే వారు, ఎలాంటి నిద్ర సమస్య లేని వారు సాయంత్రం ఎంచెక్కా టీని ఆస్వాదించవచ్చు.
అలాగే కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు కచ్చితంగా దూరంగా ఉండాల్సిందే. నిద్ర సమస్య ఉన్నవారు, మలబద్ధకం, అసిడిటీ లేదా గ్యాస్ సమస్య ఉన్నవారు కూడా టీ తాగకూడదు. వీరితో పాటు బరువు తక్కువగా ఉన్నవారు, జుట్టు, చర్మం, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడేవారు టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. ఇకపోతే రోజుకు ఎన్నిసార్లు టీ తాగాలి అన్న విషయానికి వస్తే.. ఒక రోజుకు ఒకటి లేదా రెండు కప్పులో టీ తాగావచ్చు. అంతకుమించి ఎక్కువగా తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అలాగే మోతాదుకు మించి టీ తాగడం వల్ల శరీరంలో డిహైడ్రేషన్ సమస్యలు తలెత్తుతాయి ఎముకలు బలహీనపడి శరీరంలో ఉండే ఐరన్ స్థాయిలు తగ్గిపోతాయి.