Health Tips: తిన్న వెంటనే టాయిలెట్ కి వెళ్తున్నారా.. అయితే ప్రమాదంలో పడ్డట్టే?
మీరు చిన్న వెంటనే మలవిసర్జనకు వెళుతున్నట్లయితే కొన్ని విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాల్సిందే అంటున్నారు..
- By Anshu Published Date - 12:30 PM, Sun - 11 August 24

మామూలుగా మనం ఆహారం తిన్న తర్వాత టాయిలెట్ కి వెళ్లడం అన్నది సాధారణం. అయితే కొందరు ఆహారం తిన్న తర్వాత కొన్ని గంటల తర్వాత మలవిసర్జనకు వెళితే మరికొందరు తిన్న వెంటనే మలవిసర్జనకు వెళుతూ ఉంటారు. నీళ్లు తాగిన ఏమి తిన్నా కూడా వెంటనే టాయిలెట్ లోకి పరుగులు తీస్తూ ఉంటారు. రోజులో ఒకటి లేదా రెండుసార్లు మలవిసర్జనకు వెళ్లడం మంచిదే కానీ అంతకుమించి వెళ్లడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెబుతున్నారు. మనం తీసుకున్న ఆహారం లోని పోషకాలను శరీరం గ్రహించిన తర్వాత.. మిగిలిన వ్యర్థాలు మలవిసర్జన రూపంలో బయటకు వస్తాయి.
కానీ ఆహారం తిన్న ప్రతిసారీ ఇలా బాత్రూమ్ వెళ్లాల్సిన పరిస్థితి వస్తే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు. దీనివల్ల అనేక రకాల సమస్యలు తలెత్తవచ్చని చెబుతున్నారు. మరి తిన్న వెంటనే మలవిసర్జనకు వెళ్తుంటే అలాంటప్పుడు ఏం చేయాలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. విటమిన్ లోపం కారణంగా తరచుగా మలం సమస్యలు ఏర్పడతాయి. శరీరంలోని అన్ని విధులను సక్రమంగా నిర్వహించడం విటమిన్ల పని. విటమిన్లు ఎముకల బలాన్ని కూడా కాపాడతాయి. మలం లేదా అతిసారం iBS లక్షణం. ఈ సమయంలో ఏదైనా తిన్న వెంటనే టాయిలెట్‌కి వెళ్లాల్సి వస్తుంది.
ఐబిఎస్ లక్షణాలతో బాధపడేవారిలో విటమిన్ డి లోపం ఎక్కువగా కనిపిస్తుందని తేలింది. కాబట్టి అలాంటి వారు విటమిన్ డి ని అందించే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. కాగా లక్షణాలతో సంబంధం లేకుండా, ప్రకోప ప్రేగు సిండ్రోమ్ కడుపు సమస్యలను కలిగిస్తుంది. కడుపు నొప్పి, తిమ్మిర్లు, కడుపు ఉబ్బరం, విరేచనాలు, మలబద్ధకం, అలసట, శక్తి లేకపోవడం, వెన్నునొప్పి, మూత్ర సమస్యలు మొదలైనవి దీని లక్షణాలుగా చెప్పవచ్చు.
విటమిన్ డి లోపం వల్ల ఎముకలు కాల్షియంను గ్రహించలేవు. క్రమంగా, బోలు ఎముకల వ్యాధి ఒక వ్యాధిగా మారుతుంది. ఎముకలు బలహీనంగా మారతాయి. చిన్నదెబ్బలకు ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. అలాంటివారు విటమిన్ డి ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. అయితే తిన్న వెంటనే మలవిసర్జనకు వెళ్తున్న వారు ఒక్కసారి వైద్యుల సలహా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఎంత లేట్ చేస్తే ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమైన చెబుతున్నారు.
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి.