Urad Dal: మినప పప్పు అతిగా తింటే…ఎంత ప్రమాదమో తెలుసా..?
మినప పప్పులో ఎన్నో రకాల పోషకవిలువలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ పప్పు వల్ల మానవ శరీరానికి ఎన్నిలాభాలు ఉన్నాయో...అన్ని రకాల దుష్ప్రభావాలు కూడాఉన్నాయి.
- By hashtagu Published Date - 08:33 AM, Thu - 9 June 22

మినప పప్పులో ఎన్నో రకాల పోషకవిలువలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని దృఢంగా ఉంచడంలో సహాయపడతాయి. ఈ పప్పు వల్ల మానవ శరీరానికి ఎన్నిలాభాలు ఉన్నాయో…అన్ని రకాల దుష్ప్రభావాలు కూడాఉన్నాయి. దీన్ని అతిగా తింటే వచ్చే నష్టాలు చాలామందికి తెలియక ఈ పప్పును ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీన్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే…యూరిక్ యాసిడ్, గౌట్ సమస్య పెరుగుతుంది. అలాంటి పరిస్థితిలో మినప పప్పును మోతాదుగా తీసుకోవాలి. ఈ మినప పప్పు ఏ వ్యక్తులు అస్సలు తీసుకోకూడదో తెలుసుకుందాం.
ఎంత మోతాదులో తినాలి.
ఈ మినప పప్పును రోజూతినేవారు జాగ్రత్తగా ఉండాలి.కొందరు ఆరోగ్యానికి మంచిది కదా పోపులో కూడా మినప పప్పును వాడుతుంటారు. కానీ దీన్ని అతిగా తినడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. మినపపప్పు కేవలం వారానికి ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో మార్పులతోపాటు అనేక రకాల దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
వీరు మినప పప్పును తినకూడదు.
1. ఇప్పటికే కీళ్లనొప్పుల సమస్యలతో బాధపడేవారు అస్సలు ఈ పప్పు జోలికి వెళ్లకూడదు
2. అజీర్ణం సమస్యలతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండాలి. ఉడకబెట్టిన పప్పుతింటే మలబద్ధకం, కడుపులో గ్యాస్, ఉబ్బరం సమస్యలు వస్తాయి.
3. యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నవారు ఈ పప్పుకు దూరంగా ఉండాలి. కిడ్నీలో కాల్షిఫికేషన్ రాళ్లు పెరగడానికి దోహదపడుతుంది.