Health Tips: మీరు కూడా గీజర్ వాటర్ తో స్నానం చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
గీజర్ నీటితో స్నానం చేసేవారు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:00 PM, Thu - 22 August 24

ఇదివరకటి రోజుల్లో స్నానం చేయాలి అనుకుంటే కొంతమంది చల్లనీటితో స్నానం చేస్తే మరి కొంతమంది కట్టెల పొయ్యి మీద నీటిని వేడి చేసుకుని స్నానం చేసేవారు. కానీ రాను రాను కట్టెల పొయ్యి వాడకం తగ్గిపోయింది. దీనికి ప్రత్యమ్యాయంగా చాలామంది గ్యాస్ పొయ్యి కాచిన నీటిని లేదంటే, హీటర్ ద్వారా వేడి అయిన నీటిని, గీజర్ వాటర్ ని ఉపయోగిస్తున్నారు. ఇక ఎక్కువ శాతం మంది ప్రస్తుతం గీజర్ వాటర్ తో స్నానం చేస్తున్నారు. గీజర్ వాటర్ తో అయితే పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు. టాప్ ఆన్ చేస్తే చాలు ఆటోమేటిక్గా వేడి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి. దీంతో వీటి వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కానీ ఇలా గీజర్ నీటితో స్నానం చేయడం అంత మంచిది కాదని అంటున్నారు. గీజర్ వాటర్ తో స్నానం చేస్తే జుట్టు ఊడిపోతుంది అని బలంగా నమ్మే వాళ్ళు కూడా లేకపోలేదు.
అయితే గీజర్ వాటర్ తో స్నానం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలట. మరి గీజర్ నీటితో స్నానం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గీజర్ నీరు ఆన్ చేయగానే వెంటనే ఆ నీటిని అలాగే పోసుకోకూడదు. అలాగే పోసుకుంటే మాత్రం జుట్టు ఊడిపోవడం ఖాయం. కాబట్టి స్నానం చేసే ముందు ఆ వాటర్ యొక్క టెంపరేచర్ ను కచ్చితంగా చూసుకోవాలి. కొంతమంది చలికాలంలో ఎక్కువ వేడిగా ఉన్న నీటితో స్నానం చేస్తూ ఉంటారు. దీనివల్ల జుట్టు ఊడిపోవడంతో పాటు చర్మం పగిలే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరీ ఎక్కువ వేడి నీళ్లు స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది కాదు. సలసలా కాగిన నీళ్ళ ను నెత్తి మీద పోసుకుంటే కచ్చితంగా జుట్టు ఊడిపోతుంది. ఎప్పుడైనా స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్ళని స్నానం చేస్తేనే మంచిది. మరి ఎక్కువ వేడి నీళ్లు స్నానం చేస్తే అది ఆరోగ్యానికి చేటు చేస్తుందని చెబుతున్నారు.
అంతేకాదు గీజర్ ఆన్ చేసి ట్యాప్ తిప్పి చాలామంది స్నానం చేస్తూ ఉంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. గీజర్ నీళ్లతో స్నానం చేసేవాళ్లు స్నానానికి ముందే గీజర్ను ఆఫ్ చేయడం మర్చిపోవద్దు. గీజర్ ను ఆఫ్ చేసిన తర్వాతనే స్నానం చేయాలి. అలా కాకుండా గీజర్ ఆన్ చేసి నిర్లక్ష్యంగా స్నానం చేస్తే ఒక్కోసారి వాటర్ లో కూడా విద్యుత్ వచ్చి కరెంట్ షాక్ కు గురయ్యే ప్రమాదం ఉంటుంది. చాలామంది బకెట్లకు బకెట్లు గీజర్ నీటితో స్నానం చేస్తూ ఉంటారు. వేడి నీళ్లతో స్నానం హాయిగా ఉందని ఎక్కువ సేపు స్నానానికి సమయం కేటాయిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ సేపు వేడి నీళ్ల స్నానం చేయడం వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయట. చర్మం తన సహజ నూనెలను కోల్పోతుందట.
దీని కారణంగా అనేక చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.. అంతేకాదు గీజర్ నీళ్ల తో స్నానం చేసేటప్పుడు ఎక్కడైనా గీజర్ చుట్టూ వాటర్ లీకేజీలు ఉంటే గమనించుకోవాలి. గీజర్లను ఎక్కువ సేపు ఆన్ చేసి కూడా ఉంచకూడదు. ఇలా ఎక్కువ సేపు ఆన్ చేసి ఉంచడం వల్ల దాని బాయిలర్ లో ఒత్తిడి పెరిగి పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి గీజర్ నీళ్లతో స్నానం చేయాలనుకునేవారు ఈ ముఖ్యమైన విషయాలను గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
note: పైన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి స్వీకరించబడినది. ఈ విషయాలు పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.