Raisins: ఎండుద్రాక్ష మంచిదే కదా అని ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఎండు ద్రాక్ష ఎక్కువగా తింటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:00 PM, Sun - 6 October 24

ఎండుద్రాక్ష వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎండు ద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తరచుగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. వీటిని అనేక రకాల స్వీట్లు తయారీలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఎండుద్రాక్షలను తింటే కడుపు తొందరగా నిండుతుంది. అలాగే కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. రక్తహీనతను పోగొడుతుందట. ఒంట్లో రక్తాన్ని పెంచుతుందని చెబుతున్నారు. జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.
అంతేకాదు ఎసిడిటీ, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు. కిస్ మిస్ లను మోతాదులో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చట. కాగా ఎండు ద్రాక్ష మంచిదే కదా అని ఎక్కువగా తింటే సమస్యలు తప్పవట. ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు వీటిని అతిగా అస్సలు తినకూడదట. మరి ఎండు ద్రాక్ష ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కిస్ మిస్ లల్లో సహజ చక్కెరలు, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఒకవేళ మీరు వీటిని అతిగా తిన్నట్టైతే బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే వెయిట్ లాస్ అయ్యేవారు వీటిని అతిగా అసలే తినకూడదట.
ఎండు ద్రాక్షలో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ పాటుగా సహజ చక్కెరలు కూడా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల దంత క్షయం, నోటి కుహరం వంటి సమస్యలు వస్తాయట. కిస్ మిస్ లో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని మితంగా తింటే మన జీర్ణక్రియకు సహాయపడుతాయి. ఒకవేళ మీరు వీటిని ఎక్కువగా తింటే ఫైబర్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం, విరేచనాలతో పాటుగా ఎన్నో జీర్ణ సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఎండుద్రాక్షల్లో ఎక్కువగా ఉండే సహజ చక్కెర మధు మేహులకు మంచిది కాదు.
వీళ్లు ఒకేసారి ఎక్కువ కిస్ మిస్ లను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. డయాబెటిస్ ఉన్నవారు లేదా ఈ సమస్య వచ్చే ప్రమాదం ఉన్నవారు వీటిని మోతాదులోనే తినాలని చెబుతున్నారు. అలాగే ఏంటో ఎండు ద్రాక్షలో ఇనుము పొటాషియం ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఖనిజాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి ఎండుద్రాక్ష తినాలి అనుకున్న వారు కేవలం మితంగా మాత్రమే తీసుకోవాలని ఎక్కువగా తీసుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.