Heart Problem: గుండె జబ్బుల సమస్యకు చెక్ పెట్టాలంటే ప్రతి రోజు ఈ పండ్లను తీసుకోవాల్సిందే?
ఈ మధ్యకాలంలో చాలామంది గుండె జబ్బుల కారణంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. చిన్న వయసు వారు కూడా ఈ గుండె జబ్బుల కారణంగా ఊహించి
- Author : Anshu
Date : 01-02-2024 - 8:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ మధ్యకాలంలో చాలామంది గుండె జబ్బుల కారణంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. చిన్న వయసు వారు కూడా ఈ గుండె జబ్బుల కారణంగా ఊహించిన విధంగా మరణిస్తున్నారు. అలా రోజు రోజుకి ఈ గుండె జబ్బుల బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే ఈ గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలి అంటే ప్రతిరోజు అరటి పండ్లు తీసుకోవాలి అంటున్నారు వైద్యులు. పూర్తి వివరాల్లోకి వెళితే.. రోజు మూడు అరటి పండ్లను తీసుకోవాలి. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు అరటిపండ్లు తినవచ్చు. ప్రతి రోజూ 3 అరటి పండ్లను తీసుకోవడం ద్వారా గుండెపోటుకి చెక్ పెట్టవచ్చు.
గుండెపోటు వచ్చిన తరువాత జాగ్రత్త పడటం కంటే అది రాకముందు నుంచే రోజుకీ 3 అరటి పండ్లను తింటూ వస్తే గుండెపోటును రాకుండా చేసుకోవచ్చు. అరటిపండు గుండెపోటును సహితం అరికట్టగలిగే ఔషదగుణాన్ని కలిగి ఉంది. గుండెపోటు మన జివితంలో ఒక సారి వచ్చిందంటే ఇక అంతే సంగతులు. గుండెపోటు అనేది ఒకసారి వస్తే పర్లేదు కానీ పదే పదే వస్తుంటే మాత్రం ప్రాణాలకు ప్రమాదం ఉన్నట్టే. కాబట్టి అంత భయంకరమైన గుండెపోటు జబ్బును రాకముందు నుంచే ఈ అరటి పండు తినడం మంచిది. తరచుగా అరటి పండు తీసుకుంటూ ఉండటం వల్ల గుండెపోటు సమస్య అన్నది మీ దరిదాపుల్లోకి కూడా కాదు. అయితే రోజూ మనం ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ కు ముందు 1 అరటి పండు ను , మధ్యాహ్నం భోజనం ముందు సమయంలో మరొకటి, రాత్రి సమయంలో డిన్నర్ కు ముందు 3 వ అరటి పండు తీసుకునె వారిలో శరిరంలో పొటాషియం శాతంను తగ్గిస్తుంది.
అలాగే మెదడు , రక్త సంబంధిత రోగాలను 21 శాతం వరకు నివారించవచ్చు. పొటాషియంతో కూడిన ఆహర పదార్దాలు.. స్పానిష్, నట్స్, పాలు, చేపలు. వీటన్నింటికీ మించి ప్రతిరోజు మూడు అరటి పండ్లు తీసుకుంటే గుండెపోటు సమస్య దరిదాపుల్లోకి కూడా రాదు. కాగా పొటాషియం కలిగి ఉన్న ఆహర పదార్దాలను అధికంగా తీసుకోవడం వల్ల గుండెపోటుతో మరణించేవారి సంఖ్య అధికమవుతుంది. అయితే ప్రతి రోజూ 3 అరటి పండ్లు తినడం వలన శరీరంలో పొటాషియం శాతాన్ని తగ్గించి గుండెపోటును రాకూండా చేస్తుంది.