Curd-Buttermilk: పెరుగు, మజ్జిగ.. ఈ రెండిటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో మీకు తెలుసా?
మనం తరచుగా తినే పెరుగు, మజ్జిగలో రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిదో, దేని వల్ల ఎక్కువ లాభాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 08:08 AM, Mon - 31 March 25

మామూలుగా మనం తరచుగా పాలు, మజ్జిగ, పెరుగు వంటివి తింటూ ఉంటాం. ప్రతిరోజు పెరుగు లేదా మజ్జిగ కచ్చితంగా తింటూ ఉంటారు. ఒక్కరోజు పెరుగు లేక పోయిన కూడా చాలా మందికి తిన్నట్టు కూడా అనిపించదు. ముఖ్యంగా రాత్రి సమయంలో తప్పనిసరిగా పెరుగు ఉండాల్సిందే. అయితే కొంతమంది పెరుగు బాగా ఇష్టపడితే మరికొందరు మజ్జిగ బాగా ఇష్టపడుతూ ఉంటారు. ఇంతకీ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏమి మంచివో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెరుగు, మజ్జిగ రెండింటిలోనూ న్యూట్రియంట్స్ ఉంటాయట. ప్రో బయోటిక్స్ కూడా ఉంటాయట. ఈ రెండింటినీ తీసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంటుందట. పెరుగు విషయానికి వస్తే.. లాక్టివ్ యాసిడ్ బ్యాక్టీరియా కారణంగా పాలు పెరుగుగా మారతాయట.
ఇది మనపు క్రీమీ టెక్చర్ లో ఉంటుందట. పెరుగు తినడం వల్ల ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, బి విటమిన్స్ లభిస్తాయట. దీనిలో ఉండే ప్రో బయోటిక్ బ్యాక్టీరియా మనం తీసుకున్న ఆహారం చక్కగా జీర్ణం అవ్వడానికి, గట్ ఆరోగ్యానికి సహాయపడుతుందట. మన రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి కూడా ఉపయోగపడుతుందట. కాగా ఎవరికైనా బ్లోటింగ్ సమస్య ఉంటే దానిని తొందరగా తగ్గిస్తుందట. ఉదయాన్నే పెరుగు తీసుకోవడం వల్ల మనకు కడుపు మంచిగా నిండిన అనుభూతి కలిగిస్తుందట. అలాగే రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుందట. మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు.
మజ్జిగ విషయానికి వస్తే.. పెరుగు తోనే మజ్జిగ తయారు చేస్తారు. మజ్జిగ లోనూ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుంది. అయితే పెరుగుతో పోలిస్తే మజ్జిగలో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. మజ్జిగ పలుచగా ఉంటుందట. పెరుగు రుచే ఉంటుంది. ఇది కూడా మనకు కాల్షియం, పాస్పరస్, రైబోఫ్లేవిన్, విటమిన్ బి12 అందిస్తుందట. బరువు పెరగకుండా ఉండాలి అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చట. ఎందుకంటే ఫ్యాట్ తో పాటు క్యాలరీలు కూడా చాలా తక్కువగా ఉంటాయట. తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణ మవ్వడానికి కూడా ఎంతో సహాయం చేస్తుందట. అలాగే గ్యాస్టిక్ సమస్యలు ఏవైనా ఉంటే తగ్గిస్తాయట. అంతేకాదు ఈ ఎండాకాలం మన బాడీని మంచిగా హైడ్రేటెడ్ గా ఉంచడంలో హెల్ప్ చేస్తుందట. కాగా ఈ రెండింటి వల్ల మనకు ఉపయోగాలు ఉన్నాయి. ఈ రెండింటిలో మీ ఛాయిస్ ని బట్టి ఏదైనా తీసుకోవచ్చట. ఈ రెండింటిలో ఏది తీసుకున్నా మీ గట్ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.