Conjunctivitis: వర్షాల కారణంగా ప్రబలుతున్న కండ్ల కలక ఇన్ఫెక్షన్
వర్షాల కారణంగా వాతావరణంలో జరిగే మార్పులు మన శరీరంపై ప్రభావం చూపిస్తాయి. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయి. జ్వరం, దగ్గు, జలుబు మాత్రమే కాదు వర్షాకాలంలో కండ్ల కలక కూడా సమస్యగా మారింది.
- By Praveen Aluthuru Published Date - 07:40 AM, Wed - 26 July 23

Conjunctivitis: వర్షాల కారణంగా వాతావరణంలో జరిగే మార్పులు మన శరీరంపై ప్రభావం చూపిస్తాయి. సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయి. జ్వరం, దగ్గు, జలుబు మాత్రమే కాదు వర్షాకాలంలో కండ్ల కలక కూడా సమస్యగా మారింది. ప్రస్తుతం భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కండ్ల కలక రోగుల సంఖ్య ఎక్కువవుతున్నట్టు ఆరోగ్యశాఖ సమాచారం ఇచ్చింది. ఐ ఫ్లూ కరోనాలా అంటువ్యాధిగా మారుతోంది. ఇంట్లో ఒకరికి సోకినప్పుడు మొత్తం కుటుంబంలో సంక్రమణ వ్యాప్తి చెందుతుంది. పాఠశాలలో పిల్లల నుండి ఒకరికొకరు సంక్రమణ వ్యాప్తి చెందుతుంది. తాజా లెక్కల ప్రకారం ఈ సారి రోగి నుంచి ఐదు నుంచి ఎనిమిది మందికి వ్యాధి సోకుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. వ్యాధి నయం కావడానికి ఎనిమిది నుంచి 10 రోజులు పడుతోంది.
కండ్లకలకతో బాధపడుతున్న రోగులలో, కళ్ళు ఎర్రగా వాపు, దురదతో పాటు నీళ్ళు కారడం జరుగుతుంది. కళ్ల నుంచి నీరు రావడంతో వ్యాధి ఇతరులకు వ్యాపిస్తోంది. కరోనా మాదిరిగానే ఈసారి ఐ ఫ్లూ కూడా ఎక్కువగా వ్యాపిస్తోందని వైడీలు చెప్తున్నారు. ఇంతకుముందు ఒక పేషెంట్ నుంచి ఇద్దరు నుంచి ముగ్గురికి సోకుతుండగా, ఈసారి ఐదు నుంచి ఎనిమిది మందికి సోకుతోంది. కంటి ఫ్లూ ఉన్న వ్యక్తిని ఒంటరిగా ఉంచాలని, అతనికి సంబందించిన వస్తువులను ముట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. కంటి ఫ్లూతో పాఠశాలకు వెళ్లే పిల్లల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు వ్యాపిస్తుంది.
కండ్ల కలక సోకిన వారు తరచుగా కళ్ళు తాకడం చేయకూడదు. కళ్లను శుభ్రం చేయడానికి టిష్యూ పేపర్‌ని ఉపయోగించాలి. కళ్లను తాకిన తర్వాత సబ్బుతో చేతులు కడుక్కోవాలి. శానిటైజర్ ఉపయోగించండి.
Also Read: Unhealthy Gut: జీర్ణసమస్యలు తరచూ వేదిస్తున్నాయా.. అయితే మీకు ఆ సమస్య ఉన్నట్లే?