Summer Drinks: వేసవికాలంలో బెస్ట్ పానీయం ఇదే.. ఈ డ్రింక్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకవ్వడం ఖాయం!
వేసవికాలంలో దొరికే కొబ్బరి నీరు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని తప్పకుండా వేసవిలో కొబ్బరినీరు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:05 PM, Fri - 25 April 25

వేసవికాలంలో ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. జ్యూస్ లు, కూల్ వాటర్ కొబ్బరి నీరు ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే కొంతమంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కొబ్బరి నీటిని తాగుతూ ఉంటారు. కొందరు మాత్రం ఎప్పుడూ తాగే కొబ్బరి బొండం ఏ కదా అని తీసి పారేస్తూ ఉంటారు. కానీ ఎండాకాలంలో కొబ్బరినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్య పోవడం ఖాయం. వేసవికి తట్టుకోవడానికి మన శరీరానికి కావలసిన మిటమిన్లు, పోషకాలు కొబ్బరి నీళ్లలో సమృద్ధిగా దొరుకుతాయి.
అలాగే డీ హైడ్రేషన్ ను నివారించడానికి కొబ్బరి నీళ్లు ఎంతో బాగా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లలో యాంటి ఆక్సిడెంట్ లు ఉంటాయి. కాగా రోగ నిరోధక శక్తినీ బలోపేతం చేయడానికి కొబ్బరి నీళ్లు దోహదపడతాయి. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఉదయాన్నే అంటే పరగడుపున ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగాలట. ఈ విధంగా క్రమం తప్పకుండా తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందట. జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే అధిక బరువును నియంత్రిస్తుందట. పరగడుపున కొబ్బరి నీళ్ళతో రోజంతా శరీరం యాక్టివ్ గా ఉంటుందట. అలాగే ఉదయం వ్యాయామం చేసిన వెంటనే మీరు కొబ్బరి నీళ్లు తాగితే కోల్పోయిన శక్తి లభిస్తుందట.
శరీరంలో వేడిని తగ్గించడానికి కొబ్బరి నీళ్లు బాగా ఉపయోగపడతాయి. వేసవి కాలంలో ఎన్ని నీళ్లు తాగిన చెమట రూపంలో నీరు వెళ్ళిపోతుంది. ఈ విధంగా జరగడంతో శరీరానికి సరిపడా నీరు అందకపోవడంతో మూత్ర పిండాలలో సమస్యలు ఏర్పడుతాయట. ముఖ్యంగా మూత్ర పిండాలలో రాళ్ళు వస్తాయి. అలాగే మూత్ర విసర్జన సమయంలో మంటగా ఉంటుంది. వీటన్నిటికి సరైన పరిష్కార మార్గం కొబ్బరి నీళ్ళు తాడగమే అని చెబుతున్నారు. కొబ్బరి నీళ్లు రోజు ఒక లీటర్ కనుక తాగితే మూత్ర విసర్జన సమయంలో సమస్యలు ఉండవు. మూత్ర పిండాలలో రాళ్ళను కొబ్బరి నీళ్ళు కరిగిస్తాయి. రక్త ప్రసరణ సరిగ్గా లేకుంటే శరీరంలో అనేక ఇబ్బందులు వస్తాయట. నరాలు, కండరాల నొప్పులు వస్తాయని, కంటి చూపు సమస్య మొదలౌతుందని అలాంటి అనేక సమస్యలకు లేత కొబ్బరి నీళ్లు తాగడం వలన ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.