Chewing Gum: టైమ్ పాస్ అవ్వడం కోసం చూయింగ్ గమ్ తెగ నమిలేస్తున్నారా.. అయితే జాగ్రత్త డేంజర్ లో పడ్డట్టే!
చాలా ఉంది టైం పాస్ కోసం అలాగే మౌత్ ఎక్ససైజ్ అవుతుంది అని చూయింగ్ గమ్ ను తెగ నమిలేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా డేంజర్ అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- By Anshu Published Date - 01:03 PM, Fri - 4 April 25

చూయింగ్ గమ్.. చిన్నపిల్లల నుంచి పెద్దవారు వరకు చాలామంది ఈ చూయింగ్ గమ్ ని టైం పాస్ కోసం నమ్ముతూ ఉంటారు. ఇంకొంతమంది నోటికి అలాగే దవడలకు ఒక చిన్నపాటి ఎక్సర్సైజ్ అవుతుందని బాగా నమ్ముతూ ఉంటారు. కొంతమంది దీని బయటకు ఉంచి వేస్తే మరి కొంతమంది అలాగే మింగేస్తూ ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు.. టైం పాస్ కోసం చూయింగ్ గమ్ ను తిన్నప్పటికీ ఇది మీ ఆరోగ్యాన్ని డేంజర్ లో పడేస్తుందట. మరి చూయింగ్ గమ్ నమ్మడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చూయింగ్ గమ్ నమలడం వల్ల, మీరు తెలియకుండానే కొన్ని వేల మైక్రో ప్లాస్టిక్ ముక్కలను మింగుతున్నట్లే అని చెబుతున్నారు. ఈ మైక్రో ప్లాస్టిక్ లు మీ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తాయట. అయితే సాధారణంగా చూయింగ్ గమ్ ను చెట్టు రసం నుంచి తయారు చేస్తారు. అవి చాలా సురక్షితం. కానీ కొన్ని కంపెనీలు తయారు చేస్తున్న చూయింగ్ గమ్‌లో మైక్రో ప్లాస్టిక్ ఉన్నట్లు తెలిపారు నిపుణులు. నేడు చాలా చూయింగ్ గమ్ లలో ప్లాస్టిక్ సంచులు, జిగురులలో తరచుగా ఉపయోగించే పాలిథిలిన్, పాలీ వినైల్ అసిటేట్ వంటి సింథటిక్ పాలిమర్‌లు ఉంటున్నాయి.
అయితే ఇలాంటి చూయింగ్ గమ్‌లను నమిలినప్పుడు వేలాది చిన్న ప్లాస్టిక్ కణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయట. అలాగే మైక్రోప్లాస్టిక్ కణాలు పేగు లైనింగ్ వంటి జీవసంబంధమైన అడ్డంకులను, కొన్ని సందర్భాల్లో రక్తం, మెదడుకు హాని చేస్తాయట. నాడీ వ్యవస్థపై మరింత తీవ్రమైన ప్రభావం చూపుతాయని చెబుతున్నారు. ప్రతి గ్రాము గమ్ నుండి 100 మైక్రో ప్లాస్టిక్ లు విడుదల అవుతున్నాయి. కొన్ని ఉత్పత్తులు గ్రాముకు 600 మైక్రోప్లాస్టిక్ లను విడుదల చేస్తాయట. కాబట్టి తినడానికి కాస్త రుచిగా అనిపించినప్పటికీ ఈ చూయింగ్ గమ్ ని నమ్మలేకపోవడమే మంచిదని చెబుతున్నారు.