Mango At Night: రాత్రి సమయంలో మామిడి పండు తింటున్నారా.. అయితే నిద్రలో ఇలాంటి మార్పులు రావడం ఖాయం!
రాత్రిపూట మామిడి పండ్లు తినవచ్చా, ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 12:00 PM, Sat - 26 April 25

మామిడి పండుని పండ్లలో రారాజుగా పిలుస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. వేసవి కాలంలో లభించే మామిడి పండ్లను ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. మామిడిపండ్ల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మామిడి పండ్లలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, సహజ చక్కెరలు కూడా ఇందులో అధికంగా ఉంటాయట. కాబట్టి మామిడి పండ్లు తినడానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.
అయితే మామిడి పండ్లు తినడానికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వీటిని పాటించకపోతే మంచి కంటే ఎక్కువ హాని చేస్తుందట. చాలా మంది ఉదయం లేదా మధ్యాహ్నం వీటిని తింటుంటారు. ఇంకొందరికి రాత్రి భోజనంతో పాటు మామిడిపండు తినే అలవాటు ఉంటుంది. చాలా మంది జ్యూస్ గా కూడా తాగుతారు. కాగా మధ్యాహ్నం మామిడి పండ్లు తిన్నప్పటికీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో మామిడి పండ్లు తినకూడదట. ఇది తీవ్రమైన శారీరక సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. రాత్రిపూట ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుంది.
అందుకే మామిడి వంటి పోషకాలు అధికంగా ఉండే పండ్లను తినకూడదట. దీనివల్ల అజీర్ణం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయట. రాత్రిపూట మామిడి పండ్లు తినడం వల్ల బరువు పెరుగుతారు. ఎందుకంటే మామిడి పండ్లలో కేలరీలు, చక్కెర అధికంగా ఉంటాయట. రాత్రిపూట సరిగ్గా జీర్ణం కాకపోతే, బరువు పెరిగే అవకాశం ఉందట. మామిడి తినడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయట. అందుకే శరీరం అలసిపోయినా నిద్ర పట్టదు. రాత్రిపూట మామిడిపండు తినడం వల్ల నిద్రలేమి సమస్యలు పెరుగుతాయట. కాబట్టి రాత్రి సమయంలో మామిడి పండ్లను తినకపోవడం మంచిది.