Dates: గర్భిణీ స్త్రీలు ఖర్జూరం తింటే ఏం జరుగుతుందో తెలుసా?
గర్భిణీ స్త్రీలు ఖర్జూరం తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 11:00 AM, Sat - 2 November 24

గర్భిణీ స్త్రీలు ఖర్జూరం తినడం వల్ల అనేక రకాల లాభాలు ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన ఖర్జూరం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రెగ్నెన్సీ సమయంలో ఖర్జూరం తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్నారు. కాగా ఖర్జురాల్లో చక్కెర పుష్కలంగా ఉంటుంది. అలాగే వీటిలో పొటాషియం మాంగనీస్ మెగ్నీషియం రాగి వంటి ఎన్నో రకాల పోషకాలు కూడా లభిస్తాయి. గర్భిణీ స్త్రీలు వీటిని తినడం వల్ల చాలా ప్రయోజనకరంగా ఉంటుందట. ప్రసవానికి కూడా చాలా ప్రయోజనకరం అంటున్నారు.
ఇందులో విటమిన్ సి, విటమిన్ బి1, విటమిన్ బి2, విటమిన్ బి3, విటమిన్ బి5ఎ1 వంటి విటమిన్లతో పాటు క్యాల్షియం, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయట. గర్భధారణ సమయంలో అలసట, బలహీనత నుంచి బయటపడటానికి ఖర్జూరాలు ప్రయోజనకరంగా ఉంటాయి. విటమిన్లు, ప్రోటీన్లు, ఇతర యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే ఖర్జూరాలను తినడం వల్ల గర్భిణులకు శక్తి అందుతుందట. కాగా పాలలో నానబెట్టిన ఖర్జూరాన్ని తింటే గుండె ఆరోగ్యంగా ఉంటుందట. ఈ ఖర్జూరాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయని చెబుతున్నారు.
ఖర్జూరాల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడుతాయట. కాగా గర్భధారణ సమయంలో మలబద్దకం సమస్య రావడం సర్వసాధారణం అని చెబుతున్నారు. దీన్ని నివారించడానికి ఖర్జూరాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయట. ఖర్జూరాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ ఇందుకు సహాయపడుతుందని చెబుతున్నారు. నానబెట్టిన ఖర్జూరాలను తినడం గర్భిణులకు ప్రయోజనకరంగా ఉంటుందట. నానబెట్టిన ఖర్జూరాలను తినడం వల్ల శరీరంలో ఐరన్ కంటెంట్ పెరుగుతుందని, గర్భిణుల ఒంట్లో రక్తహీనత సమస్య పోతుందని చెబుతున్నారు. అలాగే ఖర్జూరాలు ఎముకల ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తాయట.