Cashew: డయాబెటిస్ ఉన్నవారు జీడిపప్పు తినకూడదా.. తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
Cashew: డయాబెటిస్ సమస్య ఉన్నవారు జీడిపప్పు తినవచ్చా తినకూడదా? ఒకవేళ తింటే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 08:22 AM, Tue - 30 September 25

Cashew: ప్రస్తుత రోజుల్లో చాలామంది షుగర్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్దా అని తేడా లేకుండా చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ జబ్బు ఒక్కసారి వచ్చింది అంటే చాలు చచ్చే వరకు పోదు అన్న విషయం తెలిసిందే. షుగర్ సమస్యతో బాధపడే వారు ఏది తినాలి అన్నా కూడా ఆలోచిస్తూ ఉంటారు. అందుకే షుగర్ సమస్య ఉన్న వారిని ఒకటికి రెండుసార్లు ఆలోచించి తినాలని చెబుతూ ఉంటారు. చాలామంది షుగర్ సమస్య ఉన్నవారు డ్రై ఫ్రూట్స్ తింటూ ఉంటారు.
అయితే తినడం మంచిదే కానీ నిపుణుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అయితే డ్రై ఫ్రూట్స్ లో ఒకటైన జీడిపప్పును తినే విషయంలో చాలా మందికి అనేక రకాల సందేహాలు నెలకొంటూ ఉంటాయి. కొందరు తినవచ్చని మరికొందరు తినకూడదని చెబుతూ ఉంటారు. మరి ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డయాబెటిస్ బాధితులు జీడిపప్పును తినవచ్చట. కానీ జీడిపప్పులో ఉండే పోషకాలను, జీడిపప్పుతో ఉండే ఉపయోగాలను, ఇదే సమయంలో ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు తీసుకోవలసిన జాగ్రత్తలను తప్పకుండా తెలుసుకోవాలని చెబుతున్నారు.
కాగా జీడిపప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయట. జీడిపప్పులో హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్, విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని, మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్ ,ఐరన్ వంటి పోషకాలతో ఉండే జీడిపప్పును తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా జీడిపప్పు తినడం వల్ల కండరాలకు శక్తి వస్తుందట. ఎముకలకు బలం కూడా చేకూరుతుందని చెబుతున్నారు. జీడిపప్పు తింటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించబడుతుందట. అలాగే జీడిపప్పు మన శరీరానికి కావలసిన తక్షణ శక్తిని కూడా అందిస్తుందని చెబుతున్నారు. జీడిపప్పును తింటే మధుమేహంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట.
అయితే డయాబెటిస్ బాధితులు జీడిపప్పును మితంగా తీసుకోవాలని లేదంటే సమస్యలు తప్పవని చెబుతున్నారు. కాగా జీడిపప్పులో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్నప్పటికీ జీడిపప్పును మితంగానే తినాలట. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ వల్ల డయాబెటిస్ బాధితుల శరీరంలో రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ పెరగవట. ఈ కారణంతో డయాబెటిస్ బాధితులు ఎక్కువగా జీడిపప్పును తినకూడదని, పరిమితంగా తీసుకోవాలని చెబుతున్నారు. ఒకవేళ డయాబెటిస్ బాధితులు జీడిపప్పును తినాలంటే వాటిని ఇతర గింజ ధాన్యాలతో, డ్రై ఫ్రూట్స్ తో కలిపి తినాలట. అది కూడా మితంగానే తీసుకోవాలని చెబుతున్నారు.