Mushrooms: డయాబెటిస్ పేషెంట్లు పుట్టగొడుగులు తినవచ్చా.. తింటే ఏమవుతుందో మీకు తెలుసా?
షుగర్ వ్యాధిగ్రస్తులు పుట్టగొడుగులను తినవచ్చా లేదా ఒకవేళ తింటే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి అన్న విషయాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 12:04 PM, Wed - 18 December 24

ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ డయాబెటిస్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు నుంచే ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే షుగర్ వ్యాధి ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోవచ్చు. ఇక రక్తంలో చక్కెర స్థాయిలు ఉన్న అదుపులో ఉంచుకోవడానికి మార్కెట్లో ఎన్నో రకాల మెడిసిన్స్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అందుకే తినే ఆహార విషయంలో చాలా రకాల జాగ్రత్తలు పాటించాలని చెబుతూ ఉంటారు.
అయితే చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులకు పుట్టగొడుగులు అంటే ఇష్టం ఉన్నప్పటికీ వాటిని తినవచ్చా లేదా అని సందేహపడుతూ ఉంటారు. మరి షుగర్ వ్యాధి ఉన్నవారు పుట్టగొడుగులు తింటే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాకుందాం.. ట్టగొడుగులు మన ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. పుట్టగొడుగుల్లో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులలో విటమిన్ డి, విటమిన్ బి 2, విటమిన్ బి 3 కూడా పుష్కలంగా ఉంటాయి. పుట్టగొడుగులను ప్రతిరోజూ తినడం వల్ల శరీరం శక్తివంతంగా మారుతుందట. అలాగే మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందట.
పుట్టగొడుగులు డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని చెబుతున్నారు. కాగా పుట్టగొడుగుల్లో చక్కెర, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయట. తక్కువ కార్బ్ ఫుడ్ మధుమేహాన్ని నియంత్రించడానికి సహాయపడుతుందట. కాబట్టి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పుట్టగొడుగులు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా కాపాడుతాయని చెబుతున్నారు. ఈ విధంగా పుట్టగొడుగులు డయాబెటీస్ పేషెంట్లకు మంచి మేలు చేస్తాయని చెబుతున్నారు. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. విటమిన్ డి సూర్యరశ్మి ద్వారే కాదు ఇంకొన్ని ఆహారాల నుంచి కూడా మనకు అందుతుందట. పుట్టగొడుగులు విటమిన్ డి కి మంచి వనరులు. అందుకే పిల్లలకు విటమిన్ డి అందాలంటే పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవాలని చెబుతున్నారు. సోడియం తక్కువగా, పొటాషియం ఎక్కువగా ఉండే పుట్టగొడుగులను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య తగ్గిపోతుందట. దీనివల్ల గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణం పుట్టగొడుగులకు ఉందట. పుట్టగొడుగులు శరీరంలో పేరుకుపోయిన అవాంఛిత కొవ్వును తొలగించడానికి, గుండె ఆరోగ్యానికి కూడా సహాయపడతాయని చెబుతున్నారు.