రోజు కొన్ని ఉడికించిన వేరుశనగలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రతిరోజు కొన్ని ఉడకబెట్టిన వేరుశనగలుతుంటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో, ఇవి ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలను అందిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 16-12-2025 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
- ప్రతిరోజు ఉడికించిన వేరుశనగలు తినవచ్చా
ఉడకపెట్టిన వేరుశనగల వల్ల కలిగే లాభాలు
వేరుశెనగలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు
Boiled Peanuts: వేరుసెనగల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వేరుశనగలను ఉపయోగించి చాలా రకాల వంటలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే కొందరు ఉడకపెట్టిన తినడానికి ఇష్టపడితే మరికొందరు వేయించిన వేరుశనగలను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. వేరుశెనగలను ఉడికించి తినడం రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. ఉడికించిన వేరుశెనగలు అవసరమైన విటమిన్లు, ఖనిజాలకు నిలయం అని చెబుతున్నారు. పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ గింజలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయట. ఉడికించిన వేరుశెనగల్లో ప్రొటీన్లు,ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, వివిధ విటమిన్లు, ఖనిజాలు వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయట.
ఈ పోషకాలు సంపూర్ణ ఆరోగ్యానికి, శ్రేయస్సుకు కీలక పాత్ర పోషిస్తాయని, వేరుశెనగలో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయట. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులను మితంగా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందట. వేరుశెనగల్లో రెస్వెరాట్రాల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయట. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను నిరోధించి, ఆక్సీకరణ ఒత్తిడిని, శరీర మంటను తగ్గించడంలో సహాయపడతాయని, వేరుశెనగల్లో క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ, వాటిలోని ప్రొటీన్, ఫైబర్ ఆకలిని నియంత్రించి, సంతృప్తినిస్తాయని చెబుతున్నారు. పీనట్స్ లోని పీచుపదార్థం షుగర్ కంటెంట్ ను నెమ్మదింపజేసి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడుతుందట.
ఇది మధుమేహం ఉన్నవారికి లేదా ప్రమాదంలో ఉన్నవారికి ప్రయోజనకరం అని చెబుతున్నారు. మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఫోలేట్, నియాసిన్ వంటి పోషకాలు వేరుశెనగల్లో అధికంగా ఉంటాయట. ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థకూ ఇవి ఎంతగానో మేలు చేస్తాయని చెబుతున్నారు. ఉడికించిన వేరుశెనగలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నప్పటికీ, క్యాలరీలు అధికంగా ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవడం ముఖ్యం అని చెబుతున్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీటిని తమ రోజువారీ ఆహారంలో చేర్చుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు. ఉడికించిన వేరుశెనగలలోని డైటరీ ఫైబర్ క్రమబద్ధమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుందట. దీనికి ప్రీబయోటిక్ లక్షణాలు కూడా ఉంటాయని, మంచి జీర్ణక్రియను కోరుకునే వారికి ఇది ఒక గొప్ప ఎంపిక అని చెబుతున్నారు.