HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Black Spots Banana Is Good Or Bad 2

Banana: నల్లటి మచ్చలు ఉన్న అరటి పండ్లు తింటే ఏమవుతుందో మీకు తెలుసా?

నల్లటి మచ్చలు ఉన్న అరటి పండ్లు తినవచ్చా తినకూడదా, ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 21-03-2025 - 5:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Banana
Banana

మామూలుగా మనకు మార్కెట్లో ఏడాది పొడవునా అరటి పండ్లు లభిస్తూ ఉంటాయి. కొన్ని పసుపు పచ్చగా ఉంటే మరికొన్ని ఎరుపుగా కూడా ఉంటాయి. ఇలా రకరకాల అరటి పండ్లు లభిస్తూ ఉంటాయి. అయితే కొన్నిసార్లు చుక్క అరటి పండ్లు అనేవి కూడా లభిస్తూ ఉంటాయి. చాలావరకు ఈ చుక్క అరటి పండ్లను తినడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇవి చాలా తీపి గా ఉంటాయని ఇంకా మంచి ప్రయోజనాలను కలిగి ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఇంతకీ నల్లటి మచ్చలు ఉన్న అరటిపండును తినవచ్చా, తినకూడదా తింటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చాలామంది అరటిపండు తొక్కపై నల్లటి మచ్చలు కుళ్లిపోవడానికి సంకేతం అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇవి పాడైపోయినవని కాదట. లాంటి అరటి పండు బాగా పండిందని అర్థం అంటున్నారు. అరటి పండు తొక్కపై ఉండే నల్లమచ్చల్లోని టీఎన్ఎఫ్ క్యాన్సర్ తో పోరాడుతుందట. ఇది శరీరంలోని క్యాన్సర్ కణాలతో పోరాడుతుందట. అలాగే క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా అడ్డుకుంటుందని చెబుతున్నారు. బాగా పండిన అరటి పండ్లు తీయగా, టేస్టీగా ఉంటాయట.. అరటిపండ్లు బాగా పండినప్పుడు వాటిలోని పిండి పదార్థాలు చక్కెరలుగా మార్చబడతాయట ఈ పండ్లు చాలా ఈజీగా జీర్ణమవుతాయని, జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయని చెబుతున్నారు. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఈ పండ్లు మంచి ప్రయోజనకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..

అదేవిధంగా అరటి పండు తొక్కపై ఉండే నల్ల మచ్చల్లో పొటాషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. శరీరంలో అనవసరపు కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉండదు. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బాగా పండిన అరటిపండు యాంటాసిడ్ గా పనిచేస్తుందట. అలాగే కడుపు ఆమ్లాలు, చికాకు నుంచి కూడా ఇలాంటి పండ్లు రక్షిస్తాయట. ఇలాంటి పండ్లను తినడం వల్ల గుండెల్లో మంట త్వరగా తగ్గిపోతుందని చెబుతున్నారు. కాగా బాగా పండిన అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట. ఇవి మీ రోగనిరోధక శక్తిని పెంచుతాయట. దీంతో మీరు అంటు వ్యాధులు, సీజనల్, ఇతర అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారట. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటేనే రోగాలకు దూరంగా ఉంటారని చెబుతున్నారు. బాగా పండిన అరటి పండ్లను డయాబెటిస్ పేషెంట్లు తినకూడదట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • banana
  • banana benefits
  • black spots
  • health tips

Related News

Wow... is eating too many dry fruits really that dangerous?

Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

డ్రై ఫ్రూట్స్.. ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ వీటి ధర కారణంగా చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి భయపడుతూ ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదే కానీ, అలా అని మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం పక్కాగా పాడవుతుందని చెబుతున్నారు. మరి డ్రై ఫ్రూట్స్‌ను మోతాదుకు మించి తింటే ఏం జరుగు

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd