Summer Foods: ఎండాకాలంలో ఈ ఐదు రకాల ఐదు పదార్థాలు తింటే చాలు.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం!
వేసవికాలంలో ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల రుచుకి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మీ సొంతం అవుతుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:00 PM, Thu - 15 May 25

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. బానుడు సెగలు కక్కుతున్నాడు. ఇకపోతే వేసవికాలం వచ్చింది అంటే ఆరోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. అందుకే వేసవిలో అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలి అంటే తప్పకుండా మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఫుడ్ పై చాలా ఎక్కువ శ్రద్ధ చూపాలి. ఎందుకంటే ఎండాకాలంలో జీర్ణక్రియ మందకొడిగా ఉంటుందట. ఎండాకాలంలో 5 రకాల ఫుడ్స్ తింటే జీర్ణ సంబంధిత సమస్యలు రాకుండా శరీరం చల్లగా, శక్తివంతంగా ఉంటుందట. ఇవి తినడానికి రుచికరంగా ఉండటమే కాకుండా సులభంగా జీర్ణమవుతాయి. ఇంతకీ వేసవిలో తినాల్సిన ఆ 5 బెస్ట్ ఫుడ్స్ ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేసవికాలంలో చాలామంది పెరుగన్నం తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎండవేడికి తట్టుకోలేక చల్లచల్లగా పెరుగన్నం తింటుంటారు.
పెరుగు అన్నం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఎండాకాలంలో తరచుగా వచ్చే అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుందట. పెరుగు అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి తక్షణ శక్తినిస్తాయట. అలాగే రక్తపోటు అదుపులో ఉంటుందట. చర్మాన్ని తేమగా,మృదువుగా ఉంచుతుందట. శరీరంలో కొవ్వను కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. సమ్మర్ లో శరీరం వేడెక్కకుండా కాపాడుతుందట. అలాగే వేసవికాలంలో తీసుకోవలసిన ఆహార పదార్థాలలో నిమ్మకాయ రసంతో చేసిన పులిహోర కూడా ఒకటి. దేనినే చిత్రాన్నం అని కూడా అంటూ ఉంటారు. ఇది చాలా సులభంగా జీర్ణమయ్యే ఆహారం. ఎండాకాలంలో శరీరంలో వెంటనే అలసిపోతుందట. పులిహోర శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ముఖ్యంగా మధ్యాహ్నా భోజనానికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెబుతున్నారు.
పులిహోర తయారీ కోసం కొందరు ఎక్కువనూనె వాడతారు. అయితే వేసవిలో అధిక నూనె తీసుకోవడం వల్ల అజీర్ణం,ఇతర సమస్యలు వస్తాయట. కాబట్టి పులిహోరను తక్కువ నూనెతో తీసుకుంటే మంచిదట. వేసవికాలంలో తీసుకోవాల్సిన వాటిలో వెజ్ పులావ్ కూడా ఒకటి. వెజ్ పులావ్ వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వెజ్ పులావ్ లో వేసే కూరగాయలు బియ్యం తేలికగా జీర్ణం అవుతాయి. వీటిని తినడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు ఫైబర్ మినరల్స్ కూడా లభిస్తాయి. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. కూరగాయలలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది. అలాగే వండేటప్పుడు నీళ్లు ఉపయోగిస్తారు. దీంతో ఇది డీహైడ్రేషన్ నివారించడంలో సహాయపడుతుందట. తక్కువ నూనెతోనే దీనిని తయారు చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయట. దీన్ని తినడం వల్ల కడుపు నిండిన భావన కలుగుతుందట. ఇది ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంచడానికి సహాయపడుతుందట.
టమాటా రైస్ వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. టమోటా రైస్ ను వేసేవి కాలంలో తీసుకోవడం వల్ల తేలికగా జీర్ణం అవుతుందట. వేసవి కాలంలో మధ్యాహ్నం సమయంలో టమాటా రైస్ తీసుకోవడం వల్ల మంచి జరుగుతుందని చెబుతున్నారు. సాధారణంగా ఎండాకాలంలో కొన్నిసార్లు ఆకలి మందగిస్తుంది కాబట్టి ఇది ఆకలిపి పెంచడానికి సహాయపడుతుంది. టమాటోలలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సహాయపడుతుందట. టమాటోలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది సమ్మర్ లో రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్ సి చాలా అవసరం అని చెబుతున్నారు. అలాగే బియ్యం, పెసర పప్పుతో చేసే కిచిడి సమ్మర్ లో తినడానికి బెస్ట్ ఫుడ్ అని చెబుతున్నారు. ఎండా కాలంలో కడుపుకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందట. అలాగే పోషక విలువలను కూడా కలిగి ఉంటుందట. డీహైడ్రేషన్ నివారించడానికి సహాయపడుతుందని, పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని వయస్సుల వారికి ఇది తినడానికి మంచిదని, తర్వగా జీర్ణం అయిపోతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.