Weight Loss: కిలోల కొద్ది బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే రాత్రిపూట ఈ వెజ్ ఫుడ్స్ తినాల్సిందే!
త్వరగా బరువు తగ్గాలి అనుకున్న వారు రాత్రిపూట కొన్ని రకాల వెజ్ ఫుడ్స్ తీసుకోవాలని, తద్వారా ఈజీగా బరువు తగ్గుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
- By Anshu Published Date - 01:03 PM, Sat - 14 December 24

ప్రస్తుత రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ అధిక బరువు సమస్య కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బరువు తగ్గడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ బరువు తగ్గక తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే అధిక బరువును తగ్గించుకోవాలి అనుకుంటున్నారు రాత్రి సమయంలో కొన్ని రకాల వెజ్ ఫుడ్స్ ని తీసుకోవాలని చెబుతున్నారు. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఎర్ర కందిపప్పుని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టి అందులో బటర్ వేసి వెల్లుల్లి తురుము వేసి బాగా వేయించాలి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్స్, సెలెరీ, మీకు ఇష్టమైన మసాలాలు వేసి చివరగా పప్పుని మెత్తగా చేసి వేయాలి. తర్వాత కావాల్సినన్నీ నీరు పోయాలి. చివర్లో కొద్దిగా క్రీమ్ వేయాలి. అంతే చక్కని సూప్ రెడీ. ఈ సూప్ ని రాత్రి సమయంలో తాగడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు.
అలాగే కొన్ని మీకు నచ్చిన కూరగాయలు అనగా బ్రకోలీ, క్యాప్సికమ్, క్యారెట్స్, బీన్స్ ఇలా తీసుకుని క్లీన్ చేసుకుని అన్నీ మీడియం సైజ్ లో కట్ చేసుకోవాలి. తర్వాత వీటిని కొద్దిగా వాటర్ వేసి ఉడికించాలీ. దగ్గర పడ్డాక అందులో అల్లం తురుము, వెల్లుల్లి తురుము, ఉప్పు, మిరియాల పొడి వేసి పై నుంచి నిమ్మరసం వేసుకుని తింటే టేస్ట్ అద్భుతంగా ఉండడంతో పాటు తక్కువ సమయంలోనే త్వరగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు.
ఓట్స్ పొంగల్..కూడా బరువు తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి, అది కాస్తా కరిగాక జీడిపప్పు వేసి వేయించి తీసి పక్కన పెట్టాలీ. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. కొద్దిగా మిరియాలు వేసి వేయించాలి. తర్వాత అందులోనే ఓట్స్, కడిగి పెట్టుకున్న పెసరపప్పు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై అవ్వనిచ్చి, తర్వాత సిమ్ లో ఉంచి ఉప్పు, పసుపు, నీరు వేసి బాగా కలపాలి. ఇప్పుడు పప్పు ఉడికేవరకూ ఉడకనివ్వాలీ. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు వేసి తింటే బరువు ఈజీగా తగ్గుతారట.