Ghee: చలికాలంలో నెయ్యి తినండి.. ఆ సమస్యలకు చెక్ పెట్టేయండి?
నెయ్యి తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. నెయ్యిని ఎన్నో రకాల
- By Nakshatra Published Date - 06:30 AM, Wed - 11 January 23
నెయ్యి తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. నెయ్యిని ఎన్నో రకాల వంటకాలలో అలాగే స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. వేడివేడి అన్నంలో ముద్ద పప్పు ఆవకాయలో కొంచెం నెయ్యి వేసుకుని తింటే వేరే లెవెల్ అని చెప్పవచ్చు. ఇలా మనం తినే పలు రకాల ఆహారాలలో నెయ్యిని కలుపుకొని తినడం వల్ల టేస్ట్ రావడంతో పాటుగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అయితే నెయ్యిని చలికాలం తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నెయ్యి చలికాలంలో తరచుగా ఇబ్బంది పెట్టే బలుబు, దగ్గు, ఫ్లూ, అలర్జీల నుంచి రక్షణ లభిస్తుంది.
ఇందులో ఎ, ఇ, డి, కె వంటి కొవ్వుల్ని కరిగించుకునే విటమిన్లు, ఒమేగా 3, ఒమేగా 6 వంటి ఫ్యాటీ యాసిడ్స్, లినోలిక్, బ్యుటిరిక్ యాసిడ్స్ పుష్కలంగా లభిస్తాయి. మాములుగా చలికాలంలో జిర్ణక్రియ మందగిస్తూ ఉంటుంది. అటువంటప్పుడు డైట్ లో నెయ్యి చేర్చుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. నెయ్యి జీర్ణవ్యవస్థలో కొన్ని రకాల యాసిడ్స్ విడుదలయ్యేలా చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు సాహాయపడుతుంది. ప్రతి రోజు నెయ్యిని ఆహారంతో పాటుగా తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరం అవుతుంది. అలాగే చలికాలంలో నెయ్యి తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. శరీరంలోనిని అంతర్గత ఉష్ణాన్ని క్రమబద్ధీకరించి ఉంచేందుకు నెయ్యి సహకరిస్తుంది.
నెయ్యికి స్మోకింగ్ పాయింట్ అధికంగా ఉంటుంది.చల్లని వాతావరణంలో వంట చేయడానికి అనువుగా ఉంటుంది. అలాగే నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. చలి కాలంలో వచ్చే దగ్గు, జలుబు వంటీ వాటి నుంచి రక్షణ ఇస్తాయి. జలుబుతో బాధపడుతుందే ఆవు నెయ్యి రెండు చుక్కలు ముక్కులో వేస్తే జలుబు, దగ్గు నుంచి తక్షణ ఉపశమనం పొందవచ్చు. కాగా నెయ్యి కేవలం ఆరోగ్యానికే కాదు అందానికీ కూడా మేలు చేస్తుంది. ఇది న్యాచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. నెయ్యిని చర్మానికి అప్లై చేస్తే చర్మం మృదువుగా మారుతుంది. అలాగే చలి కాలంలో పెదాలు పగిలి కొన్ని సందర్భాల్లో రక్తం కూడా వస్తుంటుంది. ఇలాంటి వారు రాత్రి పడుకొనే ముందు కాస్త నెయ్యిని తీసుకొని దాంతో పెదాలపై కాసేపు నెమ్మదిగా మర్దన చేసుకోవాలి. ఇలా రోజూ చేయడం వల్ల వాతావరణం ఎంత చల్లగా ఉన్నా పెదాలు మాత్రం మృదువుగా మెరుస్తూ ఉంటాయి. చర్మంపై ఏర్పడే అలర్జీలను తగ్గించడానికీ నెయ్యి బాగా ఉపయోగపడుతుంది.
Related News
Banana With Ghee: నెయ్యి అరటిపండు కలిపి తింటే ఏం జరుగుతుందో తెలుసా?
నెయ్యి,అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ రెండింటిని కొంచెం పంచామృతంలో వినియోగిస్తూ ఉంటారు. చాలామంది ఈ రెండింటిని తినడానికి ఎక్కువగా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. రెండింటిలోనూ శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అరటిపండులో విటమిన్ సి, బి-6, యాంటీ ఆక్సిడెంట్లు, పొట�