Ghee: ఆ లాభాల కోసం అయినా సరే ప్రతిరోజు నెయ్యి తినాల్సిందే అంటున్న వైద్యులు?
కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు తరచుగా నెయ్యిని తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:00 AM, Mon - 5 August 24

మనలో చాలామందికి నెయ్యి అంటే చాలా ఇష్టం. అందుకే ఏదైనా ఆహారం తినేటప్పుడు నెయ్యి వేసుకుని తినడం, నెయ్యితో తయారు చేసిన స్వీట్లు ఎక్కువగా తినడం లాంటివి చేస్తూ ఉంటారు. నెయ్యి తరచుగా తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను పొందవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా సీజనల్ ప్రకారంగా వచ్చే వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీ బలంగా ఉండాలి. కాబట్టి అలాంటప్పుడు ఇమ్యూనిటీని పెంచే నెయ్యిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. కాబట్టి రోజు ఒక స్పూన్ నెయ్యి తింటే చాలా సమస్యలు దూరమవుతాయని వైద్యులు కూడా చెబుతున్నారు.
మరి నెయ్యి తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు దూరం అవుతాయో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నెయ్యి తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. నెయ్యిలో కొవ్వులో కరిగే విటమిన్స్ డి, కె, ఇ, ఎ లు ఉన్నాయి. నెయ్యిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది ఇతర ఆహార పదార్థాల నుండి పోషకాలను గ్రహించడంలో సహాయ పడుతుందట. కాగా మనకు వర్షాకాలంలో వ్యాధులు రావడం అన్నది సర్వసాధారణం. నెయ్యి తీసుకుంటే వాటి నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఇటువంటి సమయంలో జీర్ణ సమస్యలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి.
అలాగే గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలకు నెయ్యి ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు. ఇందులో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. పెద్దప్రేగు కణాలు తమకి ఇష్టమైన శక్తి వనరుగా బ్యూట్రిక్ యాసిడ్ ని వాడతాయి. ఉదయమే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ నెయ్యి కలిపి తీసుకుంటే మలబద్ధకం నుండి రిలాక్స్ అయి జీర్ణక్రియ మెరుగ్గా అవుతుంది. అలాగే నెయ్యి చర్మం, జుట్టుకి చాలా మంచిది. వర్షాకాలంలో ఇది కూడా అవసరమే. జ్ఞాపకశక్తిని పెంచేందుకు హెల్ప్ అవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది. అదేవిధంగా నెయ్యిలో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. దీనిని తీసుకున్న తర్వాత జీర్ణక్రియ బలంగా మారుతుందని చెబుతున్నారు. అయితే నెయ్యి ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి నెయ్యిని ఇష్టంగా తినే వారు మితంగా మాత్రమే తీసుకోవడం మంచిది..
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి.