Mango: మామిడి పండు మాత్రమే కాదు పచ్చి మామిడికాయ తిన్నా ఏం జరుగుతుందో తెలుసా?
వేసవికాలంలో దొరికితే మామిడి పండ్లను ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే పచ్చి మామిడికాయ తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
- By Anshu Published Date - 02:03 PM, Wed - 26 March 25

వేసవికాలంలో లభించే పనులలో మామిడి పండ్లు కూడా ఒకటి. వీటి కోసం ఏడాది మొత్తం ఎదురు చూస్తూ ఉంటారు మామిడి ప్రియులు. అయితే కొందరు బాగా మాగిన పండ్లు తినడానికి ఇష్టపడితే మరి కొందరు పచ్చి మామిడి పండ్లు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు.. అయితే మామిడి పండ్లు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనందరికీ తెలిసిందే. ఒకవేళ పచ్చి మామిడికాయ తింటే ఏం జరుగుతుందో ఇలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పచ్చి మామిడి కాయ శ్వాసకోశ సమస్యలను వెంటనే తగ్గిస్తుందట.
పచ్చి మామిడి కాయలో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయట. అలాగే ఇమ్యూనిటీ సిస్టమ్ ని కూడా మెరుగుపరచడంలోనూ సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే పచ్చి మామిడి కాయలో ప్రీ బయోటిక్స్ ఉంటాయి. అంతేకాకాకుండా మంచి ఫైబర్ కూడా ఉంటుంది. దాంతో పాటుగా మంచి గట్ బ్యాక్టీరియా కూడా ఉంటుందట. ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు.
కాగా పచ్చి మామిడి కాయను తినడం వల్ల అందం కూడా పెరుగుతుందట. మామిడిలో ఉండే విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం మెరిసిపోయేలా చేయడంలో సహాయ పడతాయని చెబుతున్నారు.
అలాగే ఎక్కువ కాలం యంగ్ గా కనిపించేలా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందట. అదేవిధంగా దుర్వాసన సమస్యతో బాధపడేవారు ఈ పచ్చి మామిడి కాయను కనుక తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. కాగా మామిడి కాయలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయట. ఇవి మన ఆహారం మంచిగా జీర్ణమవ్వడానికి సహాయపడతాయని చెబుతున్నారు. కాబట్టి చిన్న మామిడి ముక్క మీ జీర్ణ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని చెబుతున్నారు. కాగా పచ్చి మామిడి కాయలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీనిని తినడం వల్ కంటి చూపు బాగా మెరుగుపడుతుందట. రక్తంలో షుగర్ లెవల్స్ ని రెగ్యులేట్ చేయడంలోనూ షుగర్ లెవల్స్ ని కంట్రోల్ చేయడంలోనూ మామిడి కాయ సహాయపడుతుందట. షుగర్ ఉన్నవారు పండు మామిడికి దూరంగా ఉన్నా పచ్చి మామిడి తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.