HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Benefits Of Eating Mango Empty Stomach

Mango: ఖాళీ కడుపుతో మామిడి పండ్లు తింటే ఏమవుతుందో మీకు తెలుసా?

ఎక్కువగా లభించే మామిడి పండ్లను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినవచ్చా, అలా తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 24-03-2025 - 3:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mango
Mango

వేసవికాలంలో మనకు ఎన్నో రకాల పండ్లు లభిస్తూ ఉంటాయి. వాటిలో మామిడి పండ్లు కూడా ఒకటి. ఈ మామిడి పండ్లను చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు. వీటి కోసం ఏడాది మొత్తం ఎంతో ఆసక్తిగా ఆశతో ఎదురు చూసే వారు కూడా ఉన్నారు. అయితే మామిడికాయల సీజన్ మొదలైంది అంటే చాలు చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు మామిడికాయలు తింటూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది ఖాళీ కడుపుతో కూడా మామిడి పండ్లు తింటూ ఉంటారు. మరి ఖాళీ కడుపుతో మామిడి పండ్లను తినవచ్చా ఒకవేళ తింటే ఏం జరుగుతుందో, ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మామిడిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందట. అలాగే మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుందట. పచ్చి మామిడి తినడం వల్ల మంట, అజీర్ణం, విరేచనాలు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. కాగా మామిడిలో పొటాషియం ఎక్కువగా ఉంటుందట. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతున్నారు. అలాగే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుందట. శరీరంలోని ఎలక్ట్రోలైట్లను సమతుల్యం చేస్తుందని చెబుతున్నారు. కాగా మామిడిలో విటమిన్ సి ఉంటుంది. ఇది యాంటీఆక్సిడెంట్, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అదేవిధంగా మామిడి పండ్లలో క్యాన్సర్‌తో పోరాడటానికి సహాయపడే ఇతర ఫైటోకెమికల్స్ ఉంటాయి. మామిడిలో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎ గా మారుతుందట. కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుందట. మామిడిలో విటమిన్లు ఎ, ఇ, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయని,ఇవి చర్మానికి మేలు చేస్తాయని చెబుతున్నారు. కానీ మామిడి కాయ స్వభావం వేడిగా ఉంటుంది. కాబట్టి తినడానికి ముందు నీటిలో నానబెట్టి తర్వాత తినాలని చెబుతున్నారు. తద్వారా చర్మ సంబంధిత సమస్యలు ఉండవట. మామిడి పండ్లు తినడానికి సరైన సమయం మధ్యాహ్నం అంటున్నారు. మామిడికాయకు వేడి స్వభావం ఉంటుంది. రాత్రిపూట మామిడి తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీనివల్ల కడుపులో వేడి, ముఖంపై మొటిమల ప్రమాదం పెరుగుతుందట. కాబట్టి ఉదయం సమయంలో తీసుకోవడం అంత మంచిది కాదని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating mango
  • health tips
  • mangoes
  • Mangos

Related News

Here are the health benefits of eating these nuts daily... Once you know their benefits, you won't be able to resist eating them!

Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

కాసేపు పనిచేయగానే అలసిపోతున్నారా..? ఏమాత్రం ఓపిక ఉండట్లేదా? రోగనిరోధక శక్తి క్షీణిస్తోందా? అయినా నో ప్రాబ్లం..! రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే మీలోని ఈ సమస్యలన్నీ దాదాపు రెండు వారాల్లో తగ్గిపోతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. వాటిలో శరీరానికి అత్యవసరమైన సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఇది నేలలో, నీటిలో మరియు కొన్ని ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకం. ఇది మార్కెట్లలో

  • Have you never drunk goat milk? Once you know this, you'll start drinking it immediately!

    Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd