Jeera Seeds: పరగడుపున జీలకర్ర తినవచ్చా.. తింటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
పోపు దినుసులలో ఒకటైన జీలకర్ర వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని ఉదయాన్నే తీసుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:00 AM, Wed - 26 March 25

మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో జీలకర్ర కూడా ఒకటి. జీలకర్రను పోపుగా ఉపయోగిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. వాడితో పాటు ఇంకా ఎన్నో రకాల ఆహార పదార్థాలలో కూడా జీలకర్రను జీలకర్ర పొడిని ఉపయోగిస్తూ ఉంటారు. జీలకర్ర వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. జీలకర్ర కడుపుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలను తగ్గించడంలో ఎంతో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కేవలం జీలకర్ర మాత్రం కాకుండా జీలకర్ర నీరు కూడా ఎంతో బాగా పనిచేస్తాయి. ఈ జీలకర్ర నీటిని ఉదయాన్నే తాగవచ్చా తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాలా మందికి ఉదయం లేవగానే.. పొట్ట ఉబ్బినట్లుగా, రాత్రి తిన్న ఆహారం అరగనట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అయితే అలాంటివారు పరగడుపున జీలకర్ర తినాలట. వీటిని తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందట. ఖాళీ కడుపుతో తినేటప్పుడు రోజంతా ఆహారాన్ని మరింత ప్రభావవంతంగా విచ్ఛిన్నం చేస్తాయని, కడుపు ఉబ్బరం సమస్యలకు పూర్తిగా చెక్ పెట్టేస్తాయని చెబుతున్నారు. కాగా కొందరికి కడుపులో యాసిడ్ ఫామ్ అయినట్లుగా అనిపించి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎసిడిటీ సమస్యతో బాధపడేవారు జీలకర్రను తమ ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుందట. ఖాళీ కడుపుతో వాటిని తీసుకోవడం ద్వారా, మీరు ఎసిడిటీ ఆ అసౌకర్య భావాల నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు.
అలాగే చాలా మంది శరీరాన్ని డీటాక్సిన్ చేయడానికి మార్కెట్లోని ఏవేవో డ్రింక్స్ తాగుతూ ఉంటారు. కానీ జీలకర్ర ఈ విషయంలో చాలా అద్భుతంగా పని చేస్తుందట. వీటిని నీటిలో మరిగించి ఖాళీ కడుపుతో తీసుకున్నప్పుడు టాక్సిన్స్ ను తొలగించి చాలా అద్భుతంగా పని చేస్తుందట. మీరు పునరుత్తేజిత అనుభూతిని కలిగి ఉంటారని, రోజూ ఈ డ్రింక్ తాగాలనే కోరిక కూడా కలుగుతుందని చెబుతున్నారు. అలాగే జీలకర్రతో రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చట. ఖాళీ కడుపుతో జీరా గింజలతో మీ రోజును ప్రారంభించడం ద్వారా, మీరు మీ రోగనిరోధక వ్యవస్థను బలంగా మార్చుకోవచ్చని చెబుతున్నారు. అలాగే బరువుము తగ్గించడంలో కూడా ఎంతో బాగా పనిచేస్తుందని చెబుతున్నారు.