Ginger Milk: చలికాలంలో అల్లం పాలు తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే?
చలికాలం మొదలయ్యింది. ఈ సీజన్ లో ఎన్నో రకాల వ్యాధులు వస్తుంటాయి. మరి ముఖ్యంగా దగ్గు,జలుబు,ఫ్లూ వంటి
- By Anshu Published Date - 08:30 AM, Wed - 23 November 22

చలికాలం మొదలయ్యింది. ఈ సీజన్ లో ఎన్నో రకాల వ్యాధులు వస్తుంటాయి. మరి ముఖ్యంగా దగ్గు, జలుబు, ఫ్లూ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. చలికాలంలో రోగనిరోధక శక్తి బలహీనపడటం వల్ల ఇటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి సమస్యలు రాకుండా ఉండాలి అంటే శీతాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తినాలి. శీతాకాలంలో అల్లం ఒక చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. అందుకే చాలామంది ఈ సీజన్లో అల్లం పాలు అల్లం టీ ఎక్కువగా తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు.
మరి చలికాలంలో అల్లం పాలు తాగడం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గొంతు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నప్పుడు అల్లం ఒక చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. చలికాలంలో దగ్గు, కఫం, ఇన్ఫెక్షన్ లు వంటి సమస్యలు వచ్చినప్పుడు అల్లం పాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి క్రమం తప్పకుండా అల్లం పాలు తాగడం వల్ల దగ్గు, గొంతు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే కానీ అల్లం పాలు తాగిన ఒక గంట తర్వాత మాత్రమే నీటిని తాగాలి.
అదేవిధంగా కడుపు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నప్పుడు అల్లం తీసుకోవడం ఎంతో మంచిది. అల్లం పాలు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకం అజీర్ణం ఎసిడిటీ వంటి కడుపుకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు రోజు అల్లం పాలు తాగడం వల్ల మంచిది. మలబద్ధకం సమస్యకు అల్లం పాలు ఒక చక్కటి ఔషధంలా పనిచేస్తాయి.