Bottle Gourd Juice: మండే ఎండల్లో ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. కలిగే మార్పులు అస్సలు నమ్మలేరు?
భగభగ మండే ఎండల్లో బయట ఎలా దొరికే శీతల పానీయాలకు బదులుగా ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 09:00 AM, Tue - 25 March 25

రోజురోజుకీ ఎండ వేడి పెరుగుతూనే ఉంది. ఉదయం 10 దాటిన తర్వాత భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి బయటకు రావాలి అంటేనే ప్రజలు భయపడుతున్నారు. అయితే వేసవి కాలంలో చాలావరకు బయట దొరికే శీతల పానీయాలు తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీటి వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే వీటికి బదులుగా మీ ఇంట్లోనే దొరికే కూరగాయలలో ఒకటైన సొరకాయ జ్యూస్ తాగితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
వేసవికాలంలో సొరకాయ జ్యూస్ తాగితే వేసవి నుంచి మీకు చాలా ఉపశమనాన్ని కలిగిస్తుందట. సొరకాయ జ్యూస్ తయారు చేసుకుని తాగితే శరీరాన్ని చల్లబరచడమే కాకుండా రక్తపోటును కూడా తగ్గిస్తుందట. అలాగే డజన్ల కొద్దీ ఇతర ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందట. కాబట్టి ఇంట్లోనే ఈ సొరకాయ జ్యూస్ సులభంగా తయారు చేసుకోవచ్చని చెబుతున్నారు. కాగా సొరకాయ జ్యూస్ చేయడానికి కావలసిన పదార్థాలు.. ఒక కప్పు సొరకాయ తరుగు, గుప్పెడు పుదీనా, అర టీస్పూన్ జీలకర్ర పొడి, అర టీస్పూన్ మిరియాల పొడి, అంగుళం అల్లం, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, నీళ్లు, ఐస్ క్యూబ్స్ తీసుకోవాలి.
కాగా ఒక కప్పు తొక్క తీసి తరిగిన సొరకాయ ముక్కలను బ్లెండర్‌లో వేసి మెత్తగా జ్యూస్ చేసుకోవాలి. తర్వాత గుప్పెడు పుదీనా, జీలకర్ర పొడి, కారం పొడి, అంగుళం అల్లం, నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు, నీళ్లు పోసి బాగా జ్యూస్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గ్లాసులో పోసి ఐస్ క్యూబ్స్ వేస్తే, సొరకాయ జ్యూస్ రెడీ అయినట్లే. ఈ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. శరీరానికి చల్లదనాన్ని అందించడంతోపాటు వేసవిలో వచ్చే చాలా రకాల సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు. డీహైడ్రేషన్ వంటి సమస్యల నుంచి బయటపడవచ్చట. బయట దొరికే శీతల పానీయాల కంటే ఈ సొరకాయ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.. సొరకాయ జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలను అస్సలు నమ్మలేరని చెబుతున్నారు.