HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Benefits Of Chewing Curry Leaves In The Morning 2

Curry Leaves: ఖాళీ కడుపుతో కరివేపాకు నమిలి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?

ఖాళీ కడుపుతో కరివేపాకు నమిలి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 27-12-2024 - 11:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Curry Leaves
Curry Leaves

చాలామంది ఈ కూరలో కరివేపాకే కదా అని తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ ఆ కరివేపాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలామందికి తెలియదు. కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు ఉండలేరు. ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి. అయితే ఈ కరివేపాకు ఆకులను ఉదయాన్నే పరగడుపున ఖాళీ కడుపుతో నమిలి తినడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు అని చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కరివేపాకులో విటమిన్, ఎ, బి, సి, ఈ లతో పాటు కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ లినాలూల్, ఆల్ఫా టెర్పినేన్, మైర్సీన్, మహా నీంబైన్, క్యారియోఫిలీన్‌ తో పాటు మరికొన్ని గుణాలు ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని రోజూ ఉదయాన్నే నాలుగు నమిలి తినడం వల్ల చాలా రకాల లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. మలబద్ధకం కడుపునొప్పి గ్యాస్ కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే నాలుగు కరివేపాకు ఆకులను నమ్మితే తినడం వల్ల ఈ సమస్యలన్నీ దూరమవుతాయట. అలాగే కరివేపాకు అధిక బరువు సమస్యను కూడా దూరం చేస్తుందని చెబుతున్నారు. కరివేపాకు మన బాడీని డీటాక్స్ చేసినట్టుగానే మన లివర్‌ ని కూడా కాపాడుతుందట.

ఇందులోని గొప్ప గుణాలు లివర్‌ ని డీటాక్సీ ఫై చేసి కాలేయాన్ని కాపాడతాయి.అదే విధంగా కరివేపాకులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బాడీ ఇన్‌ ఫ్లమేషన్‌ ని తగ్గిస్తుంది. దీని వల్ల మంట వాపు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. కాగా ఉదయాన్నే పరగడపున కరివేపాకు నమిలి తినడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ రెగ్యులేట్ అవుతాయి. దీని వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ, డయాబెటిస్ వంటి సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. అందుకే షుగర్ లాంటి సమస్యలు ఉన్నవారు ఉదయాన్నే కరివేపాకుల్ని శుభ్రంగా క్లీన్ చేసి తినడం మంచిదని చెబుతున్నారు. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల వీటిని నమిలి తినడం వల్ల బాడీలోని అన్‌వాంటెడ్ టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోయి డీటాక్సీ ఫై అవుతుంది. దీని వల్ల మొత్తం శరీరానికే చాలా మంచిది. మనం తినే జంక్ ఫుడ్, అన్‌హెల్దీ లైఫ్‌స్టైల్ కారణంగా బాడీలో టాక్సిన్స్ పెరిగిపోతాయి. కరివేపాకు తినడం వల్ల ఆ టాక్సిన్స్‌ అన్నీ కూడా దూరం అవుతాయి. కరివేపాకులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. బీటా కెరోటిన్ వంటి ప్రోటీన్స్ జుట్టు సమస్యల్ని దూరం చేస్తాయి. హెయిర్ ఫోలికల్స్‌ ని బలంగా చేస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా మార్చి ఒత్తుగా, పొడుగ్గా పెరిగేలా చేస్తుందని చెబుతున్నారు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • curry leaves
  • Curry Leaves Benefits
  • eating Curry Leaves
  • health tips

Related News

Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనార

  • A juice that boosts sexual desire... Drinking this juice will improve your sex life.

    Romantic Life: శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది..

Latest News

  • RAPO 23: హీరోగా, దర్శకుడిగా రామ్ పోతినేని కొత్త సినిమా ఓపెనింగ్

  • Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రికులకు గుడ్ న్యూస్.. ఆధ్యాత్మిక సాహస యాత్రకు సిద్ధమా?

  • Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

  • Bullet Train: హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు బుల్లెట్‌ రైలుకు మార్కింగ్‌ పనులు షురూ

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd