Belly Fat: ఏంటి బెల్లీ ఫ్యాట్ క్యాన్సర్ కు దారితీస్తుందా.. ఇందులో నిజమెంత!
బెల్లీ ఫ్యాట్ ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తే అధి క్యాన్సర్ కు దారితీస్తుందని చెబుతున్నారు.
- By Anshu Published Date - 01:00 PM, Sun - 27 October 24

ప్రస్తుత రోజుల్లో చాలామంది బెల్లీ ఫ్యాట్ సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ బెల్లీ ఫ్యాట్ సమస్య రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అతిగా తినడం, తిన్న తర్వాత కూర్చోవడం, ఎక్కువసేపు కూర్చోని పని చేయడం ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల ఈ బెల్లీ ఫ్యాట్ సమస్య వస్తూ ఉంటుంది. అయితే కొంతమంది ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల ఏమవుతుందిలే అని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కానీ బెల్లీ ఫ్యాట్ ను నిర్లక్ష్యం చేస్తే అది క్యాన్సర్ కు దారితీస్తుందని చెబుతున్నారు. మరి ఇందులో నిజానిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా కొవ్వు అనేది శరీరంలో ఐదు వేరువేరు భాగాలలో నిలువ ఉండబడుతుంది.
చర్మం కింద కొవ్వు పేరుకు పోతే దానిని సబ్కటానియస్ కొవ్వుఅని అంతర్గత అవయవాలు చుట్టూ ఉంటే విసెరల్ కొవ్వు అని అంటారు. ఎముక మధ్యన కొవ్వుని మధ్య కొవ్వు అని కండరాల కొవ్వుని ఇంట్రామస్కులర్ కొవ్వు అని అంటారు. అయితే శరీరంలోని శక్తిని లిక్విడ్ ల రూపంలో నిల్వ చేస్తుంది. పొట్ట దగ్గర ఉన్న కొవ్వు చాలా ప్రమాదకరమైనది. బాహ్య కొవ్వుని చూడటం గ్రహించడం చాలా సులభం. కానీ విసెరల్ చూడటం కష్టం, ఎందుకంటే ఇది పూర్తి కడుపులోని గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, కడుపు వంటి అన్ని ప్రధాన అవయవాలు చుట్టూ ఉంటుంది. ఈ అవయవాలను అధికంగా ప్రభావితం చేస్తుంది.
దీని వలన చాలా ప్రాణాంతక పరిణామాలు ఏర్పడతాయని చెబుతున్నారు. ఒకటి క్యాన్సర్ నిద్రలేమి, నిద్ర లేక డిప్రెషన్, రక్తపోటు, కార్డియాక్ డిసీజ్ లేదంటే హార్టిస్ట్రోక్ లేదా టైప్ టు డయాబెటిస్, కాలేయం వాపు వంటి సమస్యలు ఎక్కువగా వస్తాయట. విసెరల్ కొవ్వు వదిలించుకోవడం చాలా కష్టం అని చెబుతున్నారు. ఒత్తిడి హార్మోన్ కాటిసాల్ ఒక సమస్య ఇది సకాలంలో అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల వస్తుంది. ధ్యానం యోగా ద్వారా మీరు వత్తిడి లేని జీవితాన్ని గడపడం వలన ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.