Beauty Tips: కలబందను పెదవులకు కూడా అప్లై చేయవచ్చా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
కలబందను పెదవులకు అప్లై చేసేవారు తప్పకుండా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలట.
- By Nakshatra Published Date - 02:30 PM, Mon - 2 September 24
కలబంద అందానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే కొంతమంది నేచురల్ గా దొరికే కలబందను ఉపయోగిస్తే మరి కొందరు మార్కెట్లో దొరికే కలబంద జెల్ ని అలాగే కలబంద ప్రొడక్ట్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కలబంద అందానికి సంబంధించిన ఎన్నో సమస్యలను పరిష్కరించడం ఎంతో బాగా ఉపయోగపడుతుంది. అందుకే కలబందను ఎక్కువగా అందానికి ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు కొంతమంది కలబందను పెదవులకు కూడా అప్లై చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం కలబందను పెదాలకు అప్లై చేయవచ్చా లేదా అని సందేహపడుతూ ఉంటారు.
మరి ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కలబందలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఇంప్లమెంటరీ,యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చర్మానికి ఎంతో బాగా ఉపయోగపడతాయి.. ఇవి గాయాలనూ నయం చేయడానికి అలర్జీల నుంచి ఉపశమనం కలిగించడానికి కూడా ఉపయోగపడతాయి. శీతాకాలంలో అలాగే క్లైమేట్ కూల్ గా ఉన్నప్పుడు పెదవులు పొడిబారుతూ ఉంటాయి. అలాంటప్పుడు కలబందను పెదవులకు అప్లై చేయడం మంచిదని చెబుతున్నారు. పగిలిన పెదవులను కూడా ఇది నయం చేస్తుందట. అయితే కలబంద మాయిశ్చరైజర్ అంత గొప్పది కాదు.
కలబందను మాత్రమే కాకుండా దీన్ని హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ తో కలిపి తీసుకోవడం ప్రయోజకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. పగిలిన పెదవులకు కలబందను ఉపయోగించాలనుకుంటే కొబ్బరి నూనె, మినరల్ ఆయిల్ వంటి వాటిని బేస్ గా ఉపయోగించవచ్చని చెబుతున్నారు. కాగా కొన్ని సార్లు కలబంద చర్మాన్ని చికాకుపెడుతుందట. కలబంద అంటే పడని వారికి అది అప్లై చేసినప్పుడు చర్మం ఎర్రగా మారడం దురద పెట్టడం పెదవుల వాపు, పెదవుల చుట్టూ చర్మం ఉబ్బడం లాంటి సమస్యలు వస్తాయి. కొంతమందికి ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు. అలాంటివారు ఎలాంటి భయం లేకుండా కలబందను పగిలిన పెదవులకు అప్లై చేయడం మంచిది.
note: పైన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అని గుర్తించాలి.
Related News
Beauty Tips: ముఖంపై ముడతలు రాకుండా యంగ్ గా కనిపించాలంటే ఇలా చేయాల్సిందే!
ముఖంపై ముడతల సమస్యతో బాధపడేవారు కొన్ని చిట్కాలను పాటించాలని చెబుతున్నారు.