Cough : దగ్గు వస్తున్నప్పుడు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి..
కొన్ని ఆహార పదార్థాలను మనం తినడం వలన దగ్గు, కఫము వంటివి పెరుగుతాయి, తొందరగా తగ్గవు.
- By News Desk Published Date - 09:30 AM, Mon - 29 July 24

Cough : ప్రస్తుతం వర్షాకాలం. వానలు, వాతావరణంలో మార్పుల వల్ల మనకు జ్వరం, దగ్గు, జలుబు వంటివి వస్తుంటాయి. అలాగే సాధారణ సమయాల్లో కూడా ఎక్కువగా దగ్గు వస్తుంది. జ్వరం తగ్గినా చాలా మందికి దగ్గు మాత్రం ఎక్కువ రోజులు ఉంటుంది. దగ్గు తొందరగా తగ్గకపోవడానికి మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణం. కొన్ని ఆహార పదార్థాలను మనం తినడం వలన దగ్గు, కఫము వంటివి పెరుగుతాయి, తొందరగా తగ్గవు.
దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి పూట అన్నం తినకూడదు ఎందుకంటే అన్నం చలువ చేసే స్వభావాన్ని కలిగి ఉంటుంది అది దగ్గును పెంచుతుంది. పాలు తాగితే దగ్గు, కఫము వంటివి ఇంకా పెరుగుతాయి. కాబట్టి దగ్గు ఉన్నప్పుడు పాలు, పాల పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే దగ్గు వస్తున్నప్పుడు ఆయిల్ వస్తువులకు దూరంగా ఉండాలి. లేకపోతే రాత్రి పూట దగ్గు ఎక్కువగా వస్తుంది. దగ్గు వస్తున్నప్పుడు ఆల్కహాల్ కూడా తాగకూడదు దాని వల్ల కూడా దగ్గు పెరుగుతుంది, మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అలాగే దగ్గు వచ్చే సమయంలో మసాలా పదార్థాలు కూడా ఎక్కువగా తినకూడదు.
దాల్చిన చెక్క, కరక్కాయ, మిరియాలు, పచ్చి వెల్లుల్లి పాయలు తినడం వలన దగ్గు తగ్గుతుంది. తులసి టీ తాగినా దగ్గు తగ్గుతుంది. దాల్చిన చెక్క పొడి తేనెలో కలుపుకొని తాగితే దగ్గు తగ్గుతుంది. అలాగే మిరియాల పొడిని తేనెలో కలుపుకొని తాగినా, మిరియాల పాలు తాగినా దగ్గు తగ్గుతుంది. తమలపాకు తిన్నా దగ్గు తగ్గుతుంది. అందుకే రెగ్యులర్ గా దగ్గు వస్తే ఇలా ఆహారపదార్థాల విషయంలో జాగ్రత్త వహించాలి.
Also Read : Neem Leaves: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? అయితే వేప ఆకులను ఇలా యూజ్ చేయండి..!
గమనిక: పైన ఇచ్చిన సమాచారాన్ని పాఠకుల అవగాహన కోసం ఇంటర్నెట్ నుంచి తీసుకున్నాం. దీన్ని ‘హ్యాష్ ట్యాగ్ యూ తెలుగు’ ధృవీకరించదు.