Avoid Milk: ఈ సమస్యలు ఉన్నవారు పొరపాటున కూడా పాలను తాగకూడదట.. ఎవరో తెలుసా?
పాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు పాలు తాగకపోవడమే మంచిదని ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని చెబుతున్నారు. ఇంతకీ పాలు ఎవరు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- Author : Anshu
Date : 25-05-2025 - 2:32 IST
Published By : Hashtagu Telugu Desk
పాలు ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం మనందరికీ తెలిసిందే. పాలు పాల పదార్థాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ పాలు తీసుకుంటూ ఉంటారు. పాలు తీసుకోవడం వల్ల క్యాల్షియంతో పాటు ఇంకా ఎన్నో రకాల పోషకాలు కూడా అందుతాయి. అయితే పాలు ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ ఇప్పుడు చెప్పబోయే సమస్యలు ఉన్నవారు తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవని చెబుతున్నారు.
అయితే మరి ఇంతకీ పాలు ఎలాంటి సమస్యలు ఉన్నవారు తాగకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పాలల్లో విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ కె, విటమిన్ బి12 వంటి పోషకాలు ఉంటాయి. ఎముకలు, దంతాలు బలపడతాయట. కండరాల అభివృద్ధికి హెల్ప్ చేస్తాయట. అయితే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకోకూడదని చెబుతున్నారు. కాగా ఇన్ఫ్లమేషన్ తో ఇబ్బంది పడేవారు పాలు తీసుకోకూడదని చెబుతున్నారు. ఎందుకంటే పాలల్లో సంతృప్తి కొవ్వు ఉంటుందట. ఇది శరీరంలో మంటను పెంచుతుందట. కాగా కాలేయ సమస్యలు ఉన్నన్నారు పాలు తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు. ఎందుకు అంటే ఇది లివర్ పై నెగిటివ్ గా ప్రభావం చూపిస్తుందట. అలాగే గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు పాలు తాగకూడదని చెబుతున్నారు.
లాక్టోస్ ప్రభావం జీర్ణసమస్యలను పెంచుతుందట. అదేవిధంగా చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా పాలు తాగడం మానేయాలట. ఎందుకంటె ఇది స్కిన్ సమస్యలను పెంచుతుందట. గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి కూడా పాలు కూడా హానికరం అని చెబుతున్నారు. కాబట్టి పైన చెప్పిన సమస్యలు ఉన్న పాలు తాగకపోవడమే మంచిదని ఒకవేళ తాగాలి అనుకుంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.