AC: వేసవి తాపాన్ని తట్టుకోలేక ఎక్కువ సేపు ఏసీలో గడుపుతున్నారా.. అయితే జాగ్రత్త!
ఎండలు మండిపోతున్నాయని ఎక్కువసేపు ఏసీ రూముల్లో ఏసీ గదుల్లో గడుపుతున్నారా, అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 05:03 PM, Sun - 4 May 25

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. పగటి సమయంలో ఉష్ణోగ్రతలు దాదాపు 40 డిగ్రీలు దాటుతున్నాయి. భానుడు సెగలు కక్కుతున్నాడు. అయితే ఎండలు మండిపోతుండడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలి అంటేనే మండిపడుతున్నారు. ముఖ్యంగా ఎక్కువగా ఏసీ రూముల్లో, ఫ్యాన్స్ కింద ఎక్కువసేపు గడిపేస్తున్నారు. ముఖ్యంగా కొంచెం బాగా డబ్బు ఉన్న వాళ్ళు అయితే ఎక్కువగా ఏసీలలో ఉంటున్నారు. దాంతో ఏసీల వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కువగా ఏసి ఉపయోగించడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి అంటున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఏసీని అధికంగా ఉపయోగించడం వల్ల శరీరంలో తేమ తగ్గిపోతుందట. ఎక్కువ సమయం ఏసీలో గడపడం వల్ల చర్మం పొడిబారుతుందట. అలాగే ఒళ్ళు కూడా కాస్త దురదగా అనిపించే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ఏసీ అధిక వినియోగం వల్ల కళ్ళు పొడిబారుతాయట. కంప్యూటర్లు, ల్యాప్టాప్ల మీద ఎక్కువ సమయం వర్క్ చేసే వారికి కూడా కళ్లు పొడిబారే సమస్య వస్తుందని, ఇలాంటి వాళ్లు ఎక్కువ సేపు ఏసీ లలో ఉండడం వల్ల సమస్య మరింత తీవ్రతరమవుతుందని చెబుతున్నారు. కళ్ళ దురద, చిరాకు పెరుగుతాయి.
ఫలితంగా కంటి సమస్యలు ఇబ్బంది పెడతాయని చెబుతున్నారు. కాగా ఏసీలో ఎక్కువగా ఉండటం వల్ల చర్మంలో సహజంగా ఉండే నూనె ఉత్పత్తి తగ్గుతుందట. దీంతో చర్మం డీహైడ్రేట్ అవుతుందని, ఏసీ నుండి వచ్చే పొడి గాలికి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా ఏసీల వల్ల రోసేసియా, సోరియాసిస్, తామర వంటి చర్మ సమస్యలు మరింత తీవ్రతరం అవుతాయని చెబుతున్నారు. ఏసీలలో ఎక్కువగా ఉండటం వల్ల అకాల వృద్ధాప్యం వస్తుందట. చర్మం ముడతలు పడిపోతుందని, చర్మంలో ఎలాస్టిసిటీ తగ్గుతుందని, ఏసీ లలో ఎక్కువగా ఉండటం వల్ల జుట్టు దెబ్బతింటుందని చెబుతున్నారు. అలాగే దద్దుర్లు, అలర్జీలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందట. ఏసీలో ఎక్కువసేపు ఉండటం వల్ల శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందట. ఉబ్బసం, ఇతర అంటూ వ్యాధులు వచ్చే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎక్కువసేపు ఏసీలో ఉండకుండా మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంటే మంచిదని, అలాగే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఎక్కువ నీటిని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.