Cakes: కేక్ ఇష్టం అని తెగ తినేస్తున్నారా.. అయితే తప్పనిసరిగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే!
చాలామంది కుకీస్,కేక్స్ అంటే చాలా ఇష్టం అని వాటిని తెగ తినేస్తూ ఉంటారు. అయితే ఇలా తినడం అసలు మంచిది కాదు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:40 AM, Sat - 18 January 25

చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడి తినే పదార్థాలలో కేక్స్ కూడా ఒకటి. ఈ కేక్స్ లోనే చాలా రకాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. హనీ కేక్, క్రీమ్ కేక్, నార్మల్ కేక్ అంటూ రకరకాల కేకులు కూడా ఉన్నాయి. యానివర్సీలు బర్త్డే పార్టీలు పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ ఇలా చాలా రకాల పార్టీలకు కేక్స్ లేనిదే పని జరగదు. కేక్ తినడం మంచిదే కానీ అలా అని ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి కేక్స్ తినవచ్చా అతిగా కేక్స్ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా కేక్స్ తయారు చేసేటప్పుడు అవి అందంగా కనిపించడానికి తయారీదారులు పలు రకాల ఆర్టిఫిషయల్ కలర్స్ వాడుతూ ఉంటారు. ఈ ఆర్టిఫిషయల్ కలర్స్ అధిక మొత్తంలో ఉన్నట్లు తేలింది. మోతాదుకు మించి వాటిని వాడడంతో అవి తినడం వల్ల క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందట. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర ముప్పును కలిగిస్తాయట. రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ కేకులతో ఈ ముప్పు అధికంగా ఉంటుందని చెబుతున్నారు. ఇవి చాలా విషపూరితమైనవని పలువురు నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవడం వల్ల చర్మం వాపు, దద్దుర్లు, శ్వాస సమస్యలు వస్తాయట.
అలాగే విరేచనాలు, వికారం, కంటి చూపు సమస్యలు, కాలేయ సమస్య, థైరాయిడ్, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని చెబుతున్నారు. ఉబ్బసం, ఆస్తమా ఉన్న వారిపై ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయట. అలాగే పిల్లల్లో హైపర్ యాక్టీవ్, న్యూరో బిహేవియరల్ కు సంబంధించిన సమస్యలు వస్తాయట. అయితే ప్రాసెస్ చేసిన ఫుడ్స్, ఆర్టిఫిషల్ కలర్స్ కలిపిన ఫుడ్ తీసుకోవడం ఎప్పటికీ ప్రమాదమే. అందుకే వాటి నుంచి దూరంగా ఉండడంతో పాటు పిల్లలను కూడా వాటి దరి చేరనివ్వొద్దని ఆహార నిపుణులు చెబుతున్నారు. కేక్స్ తినాలనుకునేటపుడు, సహజమైన ఫుడ్ కలర్స్ కలిపిన కేక్స్ తినాలని, లేదా సహజమైన ఫుడ్ కలర్స్ తో ఇంట్లోనే కేక్ తయారు చేసుకొని తినవచ్చని చెబుతున్నారు. ఆర్టిఫిషల్ కలర్స్ కలిపిన వాటిని తిని, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.