Health Tips: మంచంపై కూర్చుని భోజనం చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!
మీరు కూడా మంచం ఫై కూర్చొని భోజనం చేస్తున్నారా, అయితే తప్పకుండా కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలి అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 10:00 AM, Thu - 16 January 25

మామూలుగా మనలో చాలామందికి బెడ్డుపై కూర్చుని తినే అలవాటు ఉంటుంది. అయితే ఇలా తినడం అసలు మంచిది కాదు అంటున్నారు. ఇంట్లో పెద్దలు కూడా మంచంపై కూర్చొని తినకూడదని కింద కూర్చుని తినాలని చెబుతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం ఆ మాటలను పెడ చెవిన పెట్టి మంచంపై కూర్చుని తింటూ ఉంటారు. చాదస్తం అని కొట్టి పారేస్తూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెబుతూ ఉంటారు. అది ఆరోగ్యపరంగా కూడా మంచిది కాదని చెబుతూ ఉంటారు. ఇంతకీ మంచంపై కూర్చుని తింటే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మంచంపై కూర్చొని అన్నం తినడం వల్ల రిలాక్స్డ్ పొజిషన్ ఏర్పడుతుందట. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ఇలా తినడం వల్ల కొన్నిసార్లు కడుపులో భారంగా మారుతుందట. అలాగే యాసిడ్ రిప్లక్స్ కు కారణం అవుతుందట. అలాగే తిన్న ఆహరం సరిగ్గా జీర్ణం కాదని చెబుతున్నారు. అందుకే మంచంపై కూర్చొని తినకూడదని చెబుతున్నారు. ఒకవేళ తినాలనుకుంటే సరైన భంగిమలో కూర్చొని తినడం మంచిదట. మంచంపై కూర్చొని తినడం వల్ల నిద్రపై కూడా ప్రభావం పడుతుందట. సాధారణంగా మన మైండ్ తరచుగా చేసే పనులకు అలవాటు అవుతూ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా మంచంపై కూర్చొని తింటే కచ్చితంగా మీ మైండ్ అక్కడ కూర్చొని తినడానికి అలవాటు పడుతుందట.
తద్వారా మీరు దానిపై పడుకోలేరు. అలాగే పడుకునేటప్పుడు నిద్ర కూడా పట్టదట. అందుకే మంచంపై కూర్చొని మాత్రం తినకూడదని చెబుతున్నారు. ఇది మీ ఆరోగ్యంతో పాటు నిద్రను కూడా డిస్టర్బ్ చేస్తుందట. ఉభయకాయం సాధారణంగా మంచంపై కూర్చొని తినడం వల్ల కాస్త రిలాక్స్డ్‌గా కూర్చుంటాము. అలాగే పక్కన ఫోన్ చూస్తుండడం లేదా టీవీ చూస్తూ తినడం వల్ల ఎంత తింటామో తెలియకుండానే తినేస్తుంటాం. ఇలా చేయడం వల్ల వేగంగా బరువు పెరిగిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. ఫలితంగా ఊభకాయం వంటి సమస్యల బారిన పడాల్సి వస్తుందని చెబుతున్నారు. అలాగే మంచంపై కూర్చొని తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట.