Apple Seeds: యాపిల్ గింజలు తింటున్నారా..? ప్రాణాలు కూడా పోయే అవకాశం
రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదని చాలామంది చెబుతూ ఉంటారు. యాపిల్ రోజుకొకటి తింటే డాక్టర్ అవసరం ఉండదని, హాస్పిటల్ దగ్గరకు పోవాల్సిన అవసరం ఉండదని అంటూ ఉంటారు.
- By Anshu Published Date - 08:45 PM, Thu - 27 April 23

Apple Seeds: రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదని చాలామంది చెబుతూ ఉంటారు. యాపిల్ రోజుకొకటి తింటే డాక్టర్ అవసరం ఉండదని, హాస్పిటల్ దగ్గరకు పోవాల్సిన అవసరం ఉండదని అంటూ ఉంటారు. దీనికి కారణం యాపిల్ లో మన శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉంటాయి. అందుకే పండ్లలో యాపిల్ ని రాజుగా పరిగణిస్తారు. యాపిల్ ను తినేందుకు చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
అయితే యాపిల్ తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. లేకపోతే ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం రండి.
యాపిల్ లో ఉండే గింజలను తినకూడదని చెబుతున్నార. యాపిల్ లోని గింజలను తినడం అంత మంచిది కాదట. అవి ఆరోగ్యానికి చాలా హాని చేస్తాయని చెబుతున్నారు. రెండు గింజలను తింటే ఏమీ కాదని, ఎక్కువ గింజలను తింటే ప్రమాదకరమని చెబుతున్నారు. యాపిల్ గింజలు సైనైడ్ లా పనిచేస్తాయట. ఇందులో అమిగ్డాలిన్ ఉంటుంది. ఇది మానవ శరీరంల ఉండే జీర్ణ ఎంజైమ్ లతో ప్రతిచర్య జరపుతుందని, దదీని వల్ల సైనైడ్ ను విడదల చేస్తుందని హెచ్చరిస్తున్నారు.
యాపిల్ గింజలను ఎక్కువగా తీసుకోవడం వల్ల తలనొప్పి, వికారం, కడుపునొప్పి వంటికి వస్తాయట. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కొమాలోకి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుండె ఆరోగ్యం దెబ్బ తినే అవకశముంటుందని,. బ్రెయిల్ హెల్త్ దెబ్బతిని ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదముంటుందని హెచ్చరిస్తున్నారు. పిల్లలు యాి్ గింజలు అసలు తినకూడదట.
ఇక యాపిల్ తొక్కలో పోషకాలు చాలా ఉంటాయట. ఇక ఆహార తీసుకునేటప్పుడు యాపిల్ ముక్కలు తింటే మంచిదని చెబుతున్నారు. దీంతో యాపిల్ గింజలకు దూరం ఉండాలని,వాటిని తినకూడదని వైద్యలు చెబుతున్నారు.