Snake Gourd: పొట్లకాయను అవాయిడ్ చేస్తున్నారా.. కానీ వాటి వల్ల కలిగే లాభాలు తెలిస్తే తినకుండా అసలు ఉండలేరు?
పొట్లకాయ వల్ల ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:30 PM, Sun - 25 August 24

మన వంటింట్లో దొరికే కాయగూరలలో పొట్లకాయ కూడా ఒకటి. పొట్లకాయను చాలా మంది తినడానికి అసలు ఇష్టపడరు. ఇంకొంతమంది మాత్రం లొట్టలు వేసుకుని మరీ తినేస్తూ ఉంటారు. అంతేకాకుండా పొట్లకాయతో రక రకాల రెసిపీలు కూడా తయారు చేసుకొని తింటూ ఉంటారు. పొట్లకాయ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పొట్లకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా అసలు ఉండలేరు. ఈ కాయగూరని అవాయిడ్ చేస్తున్న వాళ్ళు సైతం తినడం మొదలుపెడతారు. మరి పొట్లకాయ వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చాలామంది బరువు తగ్గడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటివారు పొట్లకాయ తీసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుందని ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. పొట్లకాయలో పోషకాలు మెండుగా ఉంటాయి. అధికంగా ఫైబర్‌తో పాటు స్వల్పంగా ప్రోటీన్లు, పిండిపదార్థాలు ఉంటాయి. అలాగే విటమిన్ ఎ, బీ1, బీ2, బీ3, బీ6, బీ9, సితో పాటు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్, సోడియం, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇది మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మనం తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడానికి తొడ్పడుతుంది. పొట్లకాయలో చాలా మంచి మొత్తంలో ఫైబర్ ఉంది. ఇది మీకు త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. దాంతో ఈజీగా బరువు తగ్గవచ్చు.
అలాగే ఈ కాయలను తింటే థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగు పడుతుంది విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి అనేక పోషకాలు పొట్లకాయలో ఉన్నాయి. ఇవి మన శరీరానికి శక్తిని ఇస్తాయి. పొట్లకాయ డయాబెటిక్ రోగులకు దివ్యౌషధం అని చెప్పవచ్చు. ఇందులో యాంటీ డయాబెటిక్ నియంత్రించే లక్షణాలు కనిపిస్తాయి. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. పొట్లకాయలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడంతో పాటు డీహైడ్రేషన్ ను నివారించడంలో పొట్లకాయ ఉఫయోగపడుతుంది. అలాగే కిడ్నీ పనితీరును కూడా మెరుగుపరుస్తుందని చెబుతున్నారు. పొట్లకాయ తీసుకోవడం వల్ల కిళ్ళ నొప్పులు వాపులు వంటి సమస్యలు కూడా ఉండవని చెబుతున్నారు.
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.