Egg Shell: కోడిగుడ్డుతో మాత్రమే కాదండోయ్.. పెంకుల వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు?
కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే
- By Nakshatra Published Date - 06:30 AM, Tue - 7 March 23

కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. అయితే కోడి గుడ్డుని వివిధ రూపాల్లో తీసుకుంటూ ఉంటారు. చాలామంది ఆమ్లెట్, ఆఫ్ బాయిల్, ఎగ్ రైస్, ఎగ్ కర్రీ ఇలా కోడిగుడ్డుని అనేక విధాలుగా తీసుకుంటూ ఉంటారు. కోడిగుడ్డుని తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కోడిగుడ్డులో కేవలం తెల్ల సొన పచ్చని సొన మాత్రమే కాకుండా కోడి గుడ్డు పెంకులు కూడా ఆరోగ్యానికి ఎంతోబాగా ఉపయోగపడతాయి. మరి కోడిగుడ్డు పెంకులను వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కానీ కోడిగుడ్డు పెంకులను డైరెక్ట్ గా తీసుకోకూడదు.
కోడిగుడ్డు పెంకులు తీసుకొని వాటిని నీటిలో 10 నిముషాలు మరిగించి ఆ తరువాత పెంకులను తీసి ఆరనివ్వాలి. అనంతరం అవి పొడిగా అయ్యాక మిక్సీలో వేసి పౌడర్‌లా పట్టాలి. మిక్సీకి రావనుకుంటే కాఫీ బ్లెండర్‌ను కూడా వాడవచ్చు. అలా తయారు చేసిన పౌడర్‌ను నిత్యం అర టేబుల్ స్పూన్ మోతాదులో తీసుకోవాలి. కోడిగుడ్డు పెంకులను తినడం వల్ల రోజులో మనకు కావల్సిన కాల్షియంలో దాదాపు 90 శాతం వరకు అందుతుంది. ఇది మన ఎముకలకు ఎంతగానో మేలు చేస్తుంది. ప్రధానంగా మహిళలకు, పిల్లలకు ఇది ఎంతో అవసరం. ఈ విధంగా చేయడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. కాఫీని మరగబెట్టే సమయంలో కొద్దిగా ఎగ్ షెల్ పౌడర్‌ను కలిపితే కాఫీ ఎక్కువ చేదుగా అనిపించదు.
దాంతో పాటు ఆ పౌడర్ ద్వారా మనకు పోషకాలు అందుతాయి. ఎగ్ షెల్ పౌడర్‌ను ఇంట్లో పెంచుకునే కుక్కలకు కూడా తినిపించవచ్చు. దాని వల్ల వాటికి కాల్షియం కూడా బాగా అందుతుంది. అయితే ఈ పౌడర్‌ను నేరుగా కాకుండా అవి తినే ఆహారంలో కలిపితే బాగుంటుంది. కోడిగుడ్డు పెంకుల పొడిలో ఉండే కాల్షియం అత్యంత సహజ సిద్ధమైనదది. దానిని శరీరం సులభంగా అరిగించుకుంటుంది. దంతాలు, ఎముకలు, కండరాలు, నరాలకు ఈ కాల్షియం ఎంతో బాగా సహాయపడుతుంది. కోడిగుడ్డు పెంకుల పౌడర్‌లో ఉండే ఔషధ కారకాలు బీపీని, రక్తంలోని చెడు కొలెస్టరాల్‌ను తగ్గిస్తాయి. ఈ పౌడర్‌ను ఫేస్‌ప్యాక్‌లా వేసుకుంటే ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. కోడిగుడ్డు పెంకుల్లో ఉండే కాల్షియం మొక్కలకు కూడా అవసరమే. ఇంట్లో మొక్కలను ఎక్కువగా పెంచేవారు ఆ పెంకుల్ని పడేయకుండా మొక్కలకు ఎరువుగా వేస్తే అవి ఏపుగా పెరుగుతాయి.

Related News

Saffron: కుంకుమ పువ్వుతో పురుషులలో అలాంటి సమస్యలకు చెక్.. అవేంటో తెలుసా?
కుంకుమ పువ్వు.. కశ్మీర్ లాంటి ప్రదేశాలలో ఎక్కువగా పండిస్తూ ఉంటారు. భారతీయులు ఈ కుంకుమ పువ్వును